పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే?
ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలలో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. ఒక్కోరోజు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతూ ఉంటాయి. అయితే గత కొంతకాలం నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు.. ఇటీవల తగ్గుతూ లేదా స్థిరంగా కొనసాగాయి. గత రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి ధరలు నేడు స్వల్పంగా పెరిగాయి.
బులియన్ మార్కెట్‌లో మంగళవారం (ఆగష్టు 22) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల (999 Gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 59,070గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 50.. 24 క్యారెట్ల బంగారం ధరపై రూ. 50 పెరిగింది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం నమోదైనవి. దేశంలోని పలు నగరాల్లో తులం బంగారం ధర ఎలా ఉందో చూద్దాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 54,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 59,220గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 59,500 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబై, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 54,150 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 59,070గా కొనసాగుతోంది.
పెళ్లిపీటలెక్కబోతున్న నిత్యామీనన్.. వరుడు ఎవరో తెలిస్తే షాకే
ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అటు హీరోల దగ్గర్నుంచి ఇటు అందాల ముద్దుగుమ్మలు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కారణం తెలియదు కానీ చిన్న వయసులోనే పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు. ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోయిన్స్ దగ్గర నుంచి వయసు ముదిరిపోతున్న ముద్దుగుమ్మల సైతం కంటిన్యూగా ఎవరికి చెప్పకుండా పెళ్లిళ్లు చేసుకుని అభిమానులకు షాక్ ఇస్తున్నారు. మరి కొంతమంది తాము ఇప్పటికే ప్రేమలో ఉన్నామని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామని అఫీషియల్ అనౌన్స్ చేసి కంగు తినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోని మరో స్టార్ హీరోయిన్ ఎవరికీ తెలియకుండా పెళ్లి పీటలు ఎక్కబోతుంది అంటూ ప్రచారం జరుగుతుంది.
చరిత్ర సృష్టించిన ప్రజ్ఞానంద.. నేడు ప్రపంచ నంబర్‌వన్ కార్ల్‌సన్‌తో తుది పోరు!
భారత యువ చెస్ సంచలనం రమేష్‌బాబు ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ ఫైనల్‌కు చేరిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకు ప్లేయర్ ఫాబియానో కరువానా (అమెరికా)ను ఓడించిన ప్రజ్ఞానంద.. ఈ రికార్డు తన పేరుపై లికించుకున్నాడు. ఇక చెస్ ప్రపంచకప్ 2023 ఫైనల్ పోరులో ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో ప్రజ్ఞానంద తాడోపేడో తేల్చుకోనున్నాడు.
అజర్‌బైజాన్ రాజధాని బాకులో జరిగిన చెస్ ప్రపంచకప్ 2023 సెమీ-ఫైనల్‌లో 3.5-2.5 తేడాతో భారత గ్రాండ్‌మాస్టర్ రమేష్‌బాబు ప్రజ్ఞానంద.. అమెరికా గ్రాండ్‌మాస్టర్ కరువానాను ఓడించాడు. హోరాహోరీగా సాగిన సెమీస్‌లో ఆది నుంచి టాప్ ఆటగాడైన కరువానాకు 18 ఏళ్ల ప్రజ్ఞానంద గట్టి పోటీనిచ్చాడు. టైబ్రేక్‌లోనూ పట్టు వదలకుండా పోరాడాడు. తొలి రెండు క్లాసికల్ గేమ్‌లు డ్రా కావడంతో.. పోరు టైబ్రేక్‌కు వెళ్లింది. టైబ్రేక్‌లో భాగంగా జరిగిన తొలి రెండు ర్యాపిడ్ గేమ్‌లు కూడా డ్రా అయ్యాయి. దీంతో ర్యాపిడ్‌లో రెండో రౌండ్‌కు గేమ్ వెళ్ళింది. అక్కడ పూర్తి ఆధిపత్యం చెలాయించిన ప్రజ్ఞానంద కరువానాను ఓడించాడు.
దేశంలో ఉద్యోగాల జాతర.. 7 నెలల పాటు కొనసాగే అవకాశం
దేశంలో ఎన్నికల వాతావరనం వచ్చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. వచ్చే ఏడాది దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు తోడు ఆగస్టు చివరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ పండుగలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో పనిచేయడానికి.. అలాగే పండుగల కోసం వివిధ కంపెనీలు, సంస్థల్లో పనిచేయడానికి ఉద్యోగులు అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నెలాఖరు నుంచే ఉద్యోగాల నియామకాల ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వీటిలో కొత్త ఉద్యోగాలతో పాటు.. ఇప్పటికే ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేసేందుకూ కంపెనీలు ఆలోచిస్తున్నాయి. వీటిలో ఎక్కువ శాతం తాత్కాలిక పద్ధతిలో జరిగే నియామకాలే ఎక్కువగా ఉండనున్నాయి. 1200 కు పైగా నియామక సంస్థలు, కన్సల్టెంట్ల నుంచి సేకరించిన అభిప్రాయాలతో, నౌక్రీ హైరింగ్ ఔట్‌లుక్ పేరిట నివేదికను సోమవారం విడుదల చేసింది. ఆగస్టు చివరి వారం నుంచి సుమారు 7 నెలల పాటు పలు సెక్టార్లలో నిపుణులైన యువతకు అవకాశాలు రాబోతున్నాయని.. మార్కెట్ సర్వేలు, సిబ్బంది సేవల సంస్థలు మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా, టీమ్‌లీజ్, లింక్డ్‌ఇన్ వంటి సంస్థలు చెప్తున్నాయి.
జియో ఫైనాన్షియల్ రాకతో.. టాప్ 20లో అదానీ, రూ. 94,000 కోట్లు సంపాదించిన మస్క్
ముఖేష్ అంబానీకి సోమవారం చాలా ప్రత్యేకం. అతని కొత్త కంపెనీ జియో ఫైనాన్షియల్ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. మార్కెట్‌లో లిస్టింగ్ కూడా అంచనాల ప్రకారమే జరిగినా ఫలితం లేకపోయింది. దీని వల్ల ముఖేష్ అంబానీ నికర విలువ కూడా చాలా నష్టపోయింది. మరోవైపు, స్వదేశీయ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ.. చైనీస్, అమెరికన్ బిలియనీర్లను దాటి ప్రపంచంలోని 20 సంపన్న బిలియనీర్ల జాబితాలోకి ప్రవేశించారు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన వ్యాపారవేత్త ఎలోన్ మస్క్ చాలా ఎక్కువగా లాభపడ్డారు. అతని సంపద 11.3 బిలియన్ డాలర్లు పెరిగింది. టెస్లా షేర్లు పెరగడం వల్ల అతని సంపద పెరిగింది.
అనుష్కకు ఆ పాడు అలవాటు ఉందట.. మీరు అసలు నమ్మలేరు
ప్రస్తుతం విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. ‘అరుంధతి’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది అనుష్క. ఆ సినిమా తర్వాత జేజమ్మగా జనాలందరి చేత పిలిపించుకున్నారు. ఇటు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే అటు కథకు ప్రాధాన్యమున్న లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అగ్రహీరోలకు సమానంగా గుర్తింపు సంపాదించుకున్నారు. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగిపోయారు. అయితే,ఇటీవల అనుష్క సినిమాలను చాలా తగ్గించేశారు. కోవిడ్ సమయంలో ‘నిశ్శబ్దం’ అనే థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను అలరించి మళ్లీ ఇంతవరకు వెండితెరపై కనిపించలేదు. ప్రస్తుతం నవీన్ తో కలిసి ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
నేడు కాంగ్రెస్ గూటికి రేఖానాయక్..
బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. అభ్యర్థుల ప్రకటిస్తూ తాను కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు కేసీఆర్.. ఇదే సమయంలో.. బోథ్, ఖానాపూర్, వైరా, కోరుట్ల, ఉప్పల్, ఆసిఫాబాద్, వేములవాడ నియోజకవర్గాల అభ్యర్థుల విషయంలో ఏడు మార్పులు చేర్పులు చేసినట్లు ఆయన వెల్లడించారు. నాంపల్లి, నర్సాపూర్, గోషామహల్, జనగాం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థిత్వాన్ని పెండింగ్‌లో ఉంచిన కేసీఆర్ తర్వాత ప్రకటిస్తానని వెల్లడించారు.
పెరుగుతున్న ధరలు.. గ్యాస్ జోలికి వెళ్లని గ్రామీణ పేదలు
దేశంలో అందుబాటులోకి వస్తున్న ఆధునిక టెక్నాలజీని ప్రజలు వినియోగించుకుంటున్నారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు మాత్రం ఇప్పటికీ ఎల్‌పీజీ వాడకుండా.. ఇంకా కట్టెల పొయ్యినే వాడుతున్నారు. ఎల్‌పీజీ సిలిండర్ ఇంట్లో ఉన్నప్పటికీ వాటిని వాడకుండా.. కట్టెలపొయ్యినే వాడుతున్నారు. అందుకు కారణం రోజు రోజుకు పెరుగుతున్న ఎల్‌పీజీ వంట గ్యాస్ ధరే కారణమని తేలింది. దేశంలోని నిరు పేదలకు వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడం భారంగా మారిందని.. దానితోపాటు దరఖాస్తు ప్రక్రియలోని సమస్యలు, సిలిండర్ డెలివరీలోని లోపాలు, ఫిర్యాదులు చేస్తే పరిష్కరించే యంత్రాంగం లేకపోవడంతో .. గ్రామీణ పేదలు వంట గ్యాస్ (ఎల్‌పీజీ) వాడటానికి విముఖత చూపడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఒక సర్వేలో వెల్లడయింది. పేదలు వంట గ్యాస్ వాడకపోవడానికి గల కారణాలపై క్లీన్ ఎయిర్ అండ్ బెటర్ హెల్త్ (సీఏబీహెచ్) ప్రాజెక్టు సర్వే జరిపింది. ఈ అధ్యయనంలో అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (యూఎస్‌ఏఐడీ) కూడా పాలుపంచుకుంది.
చికెన్ సెంటరులో కొండ చిలువ.. నాలుగు కోళ్లను తినేసి
చికెన్ సెంటర్‌లో సాధారణంగా కోళ్లు ఉంటాయి. చికెన్ సెంటర్ యజమానులు కోళ్లను కట్ చేసి ఆ మాంసాన్ని అమ్ముతుంటారు. కానీ అనంతపురంలోని ఒక చికెన్ సెంటరులో కోళ్లతోపాటు.. కొండ చిలువ కూడా దర్శనమిచ్చింది. చికెన్ షాపు యజమాని నీటి కోసం తన షాపులోని డ్రము మూత తెరవగా.. అందులో ఉన్నదానిని చూసి షాకై పరుగులు తీశాడు. ఇంతకీ డ్రమ్ములో ఏముందనుకుంటున్నారా? డ్రమ్ములో 9 అడుగుల కొండచిలువ ఉంది. డ్రమ్ములో కొండచిలువను చూసిన చికెన్ షాపు యజమాని భయంతో పరుగులు తీశాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో సోమవారం జరిగింది.
మీ భార్య పై అకౌంట్ ఓపెన్ చేస్తే.. ప్రతి నెలా రూ.47 వేలు మీ సొంతం..
ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకొస్తుంది.. ఇప్పటివరకు వచ్చిన స్కీమ్ లన్ని కూడా ఎటువంటి రిస్క్ లేకుండా ఉన్నాయి.. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్స్‌లో నేషనల్ పెన్షన్ సిస్టమ్ కూడా ఒకటి. ఇప్పుడు మనం ఈ పథకం గురించి తెలుసుకుందాం. ఈ స్కీమ్‌ను ఎన్‌పీఎస్ అని కూడా పిలుస్తారు. ఇందులో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు.. ఈ స్కీమ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం..
ఎన్‌పీఎస్ అకౌంట్‌ను మీ భార్య పేరుపై కూడా ఓపెన్ చేయొచ్చు. ఇలా చేయడం వల్ల ఆమెకు ప్రతి నెలా పెన్షన్ లభిస్తుంది. ఒకే సారి భారీ మొత్తం వస్తుంది. ఇలా చాలా బెనిఫిట్ పొందొచ్చు. సాధారణంగా అయితే ఎన్‌పీఎస్ అకౌంట్ మెచ్యూరిటీ కాలం 60 ఏళ్లు. అంటే ఆమెకు 60 ఏళ్లు వచ్చినప్పుడు ఒకేసారి భారీ మొత్తం పొందొచ్చు. అలాగు ప్రతి నెలా పెన్షన్ వస్తుంది. కొత్త రూల్స్ ప్రకారం అయితే అమెకు 65 ఏళ్లు వచ్చే వరకు కూడా ఎన్‌పీఎస్ అకౌంట్‌ను కొనసాగించొచ్చు..