Leading News Portal in Telugu

Shadab Khan: ఏంటి బాబాయ్ పక్షిలా ఎగిరి పట్టావ్ ఆ క్యాచ్


పాకిస్థాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ లో భాగంగా హంబన్‌తోట (శ్రీలంక) వేదికగా ఇవాళ( మంగళవారం) జరుగుతున్న తొలి వన్డేలో పాక్ ప్లేయర్ షాదాబ్‌ ఖాన్‌ ఓ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్నాడు. నసీం షా బౌలింగ్‌లో నమ్మశక్యం.. కానీ స్టైల్ లో షాదాబ్‌ ఖాన్‌ గాల్లోకి ఎగిరి ఆఫ్ఘన్‌ సారథి హస్మతుల్లా షాహీది క్యాచ్‌ను అందుకున్నాడు. షాహీది పుల్‌ షాట్‌ ఆడే ప్రయత్నంలో మిడ్‌ వికెట్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న షాదాబ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి డగౌట్ కు చేరుకున్నాడు. షాదాబ్‌ పక్షిలా గాల్లోకి ఎగురూతూ ఎడమ చేత్తో అందుకున్నాడు. ఈ అద్భుతమైన డైవింగ్‌ క్యాచ్‌ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.

అయితే, అంతకు ముందు ఓవర్లోనే షాహీన్‌ అఫ్రిది బౌలింగ్‌లో వరుస బంతుల్లో ఆఫ్ఘనిస్తాన్‌ వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘన్ తమ కెప్టెన్‌ వికెట్‌ కోల్పోవడంతో మరింత కష్టాల్లో పడింది. ఆ జట్టు 3.3 ఓవర్లలో కేవలం 4 రన్స్ మాత్రమే చేసి కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. 3వ ఓవర్‌ 4, 5 బంతులకు షాహీన్‌ అఫ్రిది.. ఇబ్రహీం జద్రాన్‌, రెహ్మత్‌ షాలను డకౌట్ చేసి పెవిలియన్ కు పంపగా.. 4వ ఓవర్‌ మూడో బంతికి నసీం షా.. ఆఫ్ఘన్‌ సారథిని డగౌడ్ కి పంపాడు.

అనంతరం 8వ ఓవర్‌ మొదటి బంతికి, 14వ ఓవర్‌ మూడో బంతికి హరీస్‌ రౌఫ్‌.. ఇక్రమ్‌ అలీఖిల్‌ , గుర్భాజ్‌ లను అవుట్ చేయడంతో ఆఫ్ఘన్‌ జట్టు కేవలం 35 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి పీకల్లోత్తు కష్టాల్లో పడింది. 15 ఓవర్లు ముగిశాక ఆ జట్టు స్కోర్‌ 47/5గా నిలిచింది. ఒమర్‌జాయ్‌ (10), నబీ (7) క్రీజ్‌లో ఉన్నారు. ఇక, అంతకు ముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్.. ఇమామ్‌ ఉల్‌ హాక్‌ , షాదాబ్‌ ఖాన్‌, ఇఫ్తికార్‌ అహ్మద్‌ ఓ మోస్తరుగా రాణించడంతో 47.1 ఓవర్లలో 201 రన్స్ చేసి ఆలౌటైంది. ముజీబ్‌ ఉర్‌ రెహ్మాన్‌ మూడు వికెట్లు తీసుకోగా.. రషీద్‌ ఖాన్‌ రెండు, మహ్మద్‌ నబీ రెండు వికెట్లు పడగొట్టగా, రెహ్మత్‌ షా, ఫజల్‌ హక్‌ ఫారూకీ తలో వికెట్ తీసుకున్నారు.