
ఘజియాబాద్‌లో ఓ స్కూల్ బస్సు మంటల్లో కాలిపోయింది. ఆ బస్సు ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్దిగా గుర్తించారు. అయితే మంటలు చెలరేగిన సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విద్యార్థులను దించిన కొద్ది నిమిషాలకే బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై కిందకి దిగేశాడు. ఈ ఘటనలో ఎటువంటి గాయాలు జరగలేదు. మరోవైపు ఈ సంఘటనకు గల కారణాలు తెలియరాలేదు.
Read Also: Samantha: ప్రమోషన్స్ కు రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని.. అక్కడ నువ్వు చేసే పని ఇదా..?
మీరట్ రోడ్‌లోని సిహాని గేట్ వద్ద ఉండగా బస్సులో మంటలు చెలరేగగా.. కొందరు వ్యక్తులు తమ ఫోన్లలో వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియోలో బస్సులో నుండి పెద్ద ఎత్తున పొగలు వస్తుండటం కనిపిస్తున్నాయి. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అంతేకాకుండా.. “స్థానిక పోలీసు బలగాలు సంఘటనా స్థలంలో ఉన్నాయి, మంటలను ఆర్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు” అని పోలీసులు ట్వీట్లో తెలిపారు.
Read Also: Suriya Chandoo Mondeti: సూర్య చందు మొండేటి మూవీకి అదిరిపోయే బ్యాక్‌డ్రాప్ సెట్
X (గతంలో ట్విట్టర్)లో వీడియోను పోస్ట్ చేసిన పలువురు వినియోగదారులు ఘజియాబాద్ పోలీసులను ట్యాగ్ చేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ, “అగ్నిని ఆర్పివేశాం, ఎలాంటి ప్రాణ నష్టం లేదు” అని ఒక ప్రకటనను పోస్ట్ చేశారు. గతంలో వాయువ్య ఢిల్లీలోని రోహిణి పాఠశాల బస్సు మంటల్లో చిక్కుకోవడంతో 21 మంది పిల్లలు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
#WATCH A fire broke out in a bus of Ryan Public School in Ghaziabad. A sudden fire broke out in a school bus at Sihani Gate Meerut Road.
#GHAZIABAD #MEERUT@ghaziabadpolice pic.twitter.com/ljgywQLpWt
— Nitesh rathore (@niteshr813) August 21, 2023