Zimbabwe Cricket Legend Heath Streak Died: జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్ స్ట్రీక్ కన్నుమూశారు. మహమ్మారి క్యాన్సర్‌తో పోరాడి 49 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. సుదీర్ఘ కాలం క్యాన్సర్‌తో ఇబ్బందులు పడిన హీత్ స్ట్రీక్.. మంగళవారం (ఆగస్టు 22న) తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ విషయాన్ని అతని మాజీ సహచరులు తెలిపారు. జింబాబ్వే క్రికెట్ దిగ్గజం మరణంపై క్రికెటర్లు సంతాపం ప్రకటిస్తున్నారు. హీత్ స్ట్రీక్ జింబాబ్వే తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడారు.