Leading News Portal in Telugu

Samantha: ప్రమోషన్స్ కు రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని.. అక్కడ నువ్వు చేసే పని ఇదా..?


Samantha: స్టార్ హీరోయిన్ సమంత ఒక ఏడాది సినిమాలకు గ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందదే. తన ఆరోగ్యం బాగోని కారణంగా కొంత సమయం రెస్ట్ తీసుకోవడానికి ఆమె సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే దీనికన్నా ముందు సమంత నటించిన ఖుషి సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమాకు శివ నిర్మాణ దర్శకత్వం వహించాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ మధ్య జరిగిన మ్యూజిక్ కన్సర్ట్ సినిమా పై మరింత హైప్ ని తెచ్చింది. ఈ ఈవెంట్లో స్టేజి పైనే విజయ్ దేవరకొండ, సమంత చేసిన డాన్స్ సోషల్ మీడియాలో ఎంతటి ట్రెండింగ్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ ఈవెంట్లో విజయ్ దేవరకొండ, సమంత ఆరోగ్యం గురించి, ఆమె పడిన బాధ గురించి.. ఎంతో ఎమోషనల్ అయ్యి చెప్పుకొచ్చాడు.
Tillu Square: ఏం .. రాధికా.. ఇంకా మా టిల్లుగాడిని వదలవా.. ?

ఇక ఆ మ్యూజిక్ కన్సర్ట్ తరువాత సామ్ విదేశాలకు వెళ్ళిపోయింది. న్యూయార్క్ లో ఆమె ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను నిత్యం అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇంకోపక్క రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. సమంత హెల్త్ బాగోక పోవడంతో ఆ బాధ్యత మొత్తం విజయ్ దేవరకొండ తన భుజాల మీద వేసుకున్నాడు. గత కొన్ని రోజులుగా వరుస ప్రెస్ మీట్లకు అటెండ్ అవుతూ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. ఇక దీంతో అభిమానులు సామ్ ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ప్రమోషన్స్ కి రమ్మంటే ఆరోగ్యం బాగోలేదని చెప్పి వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నావా..? అంటూ ట్రోల్ చేస్తున్నారు. అదేదో ఈ ప్రమోషన్స్ కి అటెండ్ అయితే సినిమా మరింత హిట్ అవుతుంది కదా.. అని సలహాలు ఇస్తున్నారు. సామ్ అభిమానులు మాత్రం కాలమే సామ్ గాయాన్ని మానిస్తుంది అని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ సినిమా సామ్ కు ఎలాంటి హిట్ ను ఇస్తుందో చూడాలి.