Leading News Portal in Telugu

Skin Glowing :నిమ్మ ఆకులతో ఇలా చేస్తే.. మెరిసే చర్మం మీ సొంతం..


ఈ రోజుల్లో అందం కోసం అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.. బయట దొరికే కెమికల్స్ కాకుండా ఇంట్లో దొరికే వాటితో మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చునని నిపుణులు అంటున్నారు.. నిమ్మకాయల లో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది.. కాయల్లో మాత్రమే కాదు ఆకుల్లో కూడా అధికంగా ఉంటుంది.. ఈ ఆకులను సరైన విధంగా ఉపయోగిస్తే అన్ని రకాల చర్మ సమస్యలను నివారించుకోవచ్చు.. ఎలా వాడితే మంచి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

నిమ్మ ఆకులతో చేసిన ఔషధంలో మృదువైన చర్మం పొందవచ్చు. ఇందు కోసం కొద్దిగా కొబ్బరినూనె తీసుకుని అందులో నిమ్మ ఆకుల రసం కలపండి. దాన్ని ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి తర్వాత కడిగేయండి. ఇలా వరుసగా రెండు వారాలు చేస్తే మృదువైన చర్మాన్ని పొందుతారు.

ఉద్యోగాల వల్ల కొంతమందికి సరిగ్గా నిద్ర ఉండదు.. ఫలితంగా కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడి, ముఖం అందవికారం కనిపించేలా చేస్తాయి. ఈ నల్లని వలయాలను తొలగించుకునేందుకు నిమ్మ ఆకులు మెరుగ్గా పనిచేస్తాయి. ఇందుకోసం మీరు నిమ్మ ఆకుల పేస్ట్ చేసుకొని, దానికి ఓ రెండు చెంచాల తేనెను కలిపి.. డార్క్ సర్కిల్స్‌పై చేయండి. ఓ 10, 15 నిముషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు..

మెరిసే చర్మం కోసం కూడా మీరు నిమ్మ ఆకులను ఉపయోగించవచ్చు. ఈ మేరకు మీరు నిమ్మ ఆకుల రసాన్ని తీసుకుని.. దానికి ఒక చెంచా కలబంద రసాన్ని కలపాలి. ఈ పేస్ట్‌ను దూదితో ముఖానికి అప్లై చేసి 15 నిమిషాలు అయ్యాక కడిగేస్తే చాలు చర్మం రంగు మారుతుంది.. మృదువుగా మారుతుంది..

మొటిమలను తొలగించుకోవడానికి కూడా నిమ్మ ఆకుల రసం ఉపయోగకరంగా ఉంటుంది. ఇందుకోసం మీరు ముల్తానీ మట్టిలో నిమ్మ రసం కలిపి ముఖంపై అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడిగేస్తే చాలు.. మచ్చలేని చర్మం మీ సొంతం.. నిమ్మ ఆకులను ఎండబెట్టి పొడిని స్నానం చేసే ముందు చర్మానికి రుద్ది స్నానం చేస్తే స్కిన్ కలర్ మారడంతో పాటు అలెర్జీలు పోతాయి..