posted on Aug 23, 2023 8:14PM
చంద్రుడి ఉపరితలంపై భారత్ శాశ్వత ముద్ర వేసింది. చంద్రయాన్ 3విజయవంతం కావడమే కాకుండా, జాబిల్లిపై రోవర్ ల్యాండ్ అయిన తరువాత ఈ రోవర్ చక్రాలపై ఉన్న ముద్ర శాశ్వతంగా చంద్రుడి ఉపరితలంపై ఇలా ముద్రపడిపోయింది.
ఇస్రో లోగో, భారత జాతీయ చిహ్నం చంద్రుని ఉపరితలంపై శాశ్వతంగా నిలిచిపోయాయి. చంద్ర గ్రహంపై గాలి లేని కారణంగా అవి ఎప్పటికీ చెక్కు చెదరవు. దీంతో జాబిల్లిపై భారత్ ముద్ర ఆచంద్రతారార్కం అలా వెలుగొందుతూనే ఉంటుంది.