Raviteja: మాస్ మహారాజా రవితేజ.. ఈ పేరు వినగానే నిస్సత్తువగా ఉన్నవాడి ఒంట్లో కూడా ఎనర్జీ పొంగి పొర్లుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నాం అన్నది కాదు.. మనం ఉన్నంతసేపు చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నారు అనేది ముఖ్యం. రవితేజ ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. ఎటువంటి బ్యాక్ డ్రాప్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మాస్ మహారాజాగా ఎదిగిన తీరు ఎంతోమంది అప్ కమింగ్ నటులకు ఆదర్శం. ఇక ఏడాదిలో నాలుగు సినిమాలు రిలీజ్ చేయగల సత్తా ఉన్న హీరో అంటే రవితేజనే. విజయాపజాయాలను లెక్కచేయకుండా వరుస అవకాశాను అందుకుంటున్న హీరో కూడా రవితేజనే అని చెప్పాలి. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకున్న రవితేజ.. రావణాసురతో ప్లాప్ ను అందుకున్నాడు. అయినా ఆగకుండా చేతిలో మరో మూడు సినిమాలను పెట్టుకొని అలా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం రవితేజ.. టైగర్ నాగేశ్వరరావు సినిమాతో బిజీగా ఉన్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబర్ 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Rajinikanth: ఇండియా సక్సెస్ చూసి అగ్రరాజ్యాలు అలా చూస్తున్నాయి
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. రవితేజ.. ప్రస్తుతం లండన్ వెకేషన్ లో ఉన్నాడు. తాజాగా లండన్ వైబ్స్ అంటూ కొన్ని ఫొటోలను రవితేజ అభిమానులతో పంచుకున్నాడు. ఇక ఆ ఫొటోలో రవితేజను చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. అల్ట్రా స్టైలిష్ లుక్ లో మాస్ మహారాజా అదరగొట్టేశాడు. చెక్స్ షర్ట్.. క్యాప్.. గాగుల్స్ పెట్టుకొని లండన్ బ్రిడ్జి దగ్గర కూల్ గా నిలబడి ఫోటోలకు ఫోజ్ లిచ్చాడు. 55 ఏళ్ళ వయస్సులో కూడా కుర్ర హీరోలా కనిపిస్తున్నాడు. ఇక దీంతో అభిమానులు.. ఆ అందం ఏంటీ అన్నా అని కొందరు.. ఆయనకు చెప్పండయ్యా.. ఇద్దరు బిడ్డల తండ్రి అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి టైగర్ తో రవితేజ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.