Leading News Portal in Telugu

Chess World Cup 2023: ప్రపంచ చెస్ విజేత కార్ల్ సన్.. ఫైనల్లో ప్రజ్ఞానంద ఓటమి


ఉత్కంఠభరిత పోరులో నంబర్ వన్ ఆటగాడు కార్ల్ సన్ విజయం సాధించాడు. దీంతో ప్రపంచ చెస్ ఛాంపియన్ గా కార్ల్ సన్ అవతరించాడు. ఫైనల్లో భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. ఫైనల్ టై బ్రేక్ లో ప్రజ్ఞానందపై వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు కార్ల్ సన్ వరుసగా రెండు గేమ్స్ ల్లో గెలుపొందాడు. కార్ల్ సన్ కు ఇదే తొలివరల్డ్ కప్. అయితే తొలి రెండు మ్యాచ్ లోనే విజయం సాధించిన కార్ల్ సన్.. రెండో మ్యాచ్ లోనూ ప్రజ్ఞానందకు అవకాశం ఇవ్వలేదు. మరోవైపు విజేతగా నిలిచిన కార్ల్ సన్ రూ. 91 లక్షలు, రన్నరప్ ప్రజ్ఞానంద రూ.66 లక్షల ప్రైజ్ మనీ సొంతం చేసుకోనున్నారు.

కార్ల్ సన్ తో జరిగిన ఫైనల్‌లో ప్రజ్ఞానంద ఓడిపోయి ఉండవచ్చు కానీ.. చెన్నైకి చెందిన 18 ఏళ్ల యువకుడు భారతీయ చెస్ చరిత్ర పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ఫైనల్‌కు చేరిన మొదటి భారతీయుడిగా నిలిచాడు.