ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లా మజోలా పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉపాధ్యాయుడు దారుణంగా కొట్టాడు. దీంతో విద్యార్థి తరగతి గదిలోనే స్పృహతప్పి పడిపోయాడు. అపస్మారక స్థితిలోకి చేరిన విద్యార్థిని చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే చిన్నారి గుండెలోని మృదు కణజాలంలో గాయం ఉందని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి బంధువులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.
Reliance Jio: యూజర్లకు జియో బిగ్ షాక్.. చౌకైన ప్లాన్ ఎత్తేసింది..!
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మీ పిల్లవాడు స్పృహ తప్పి పడిపోయాడని పాఠశాల నుండి తెలిపారని పేర్కొన్నారు. వెంటనే పాఠశాలకు వెళ్లి విచారించగా.. మ్యాథ్స్ టీచర్ దారుణంగా కొట్టినట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడికి చెప్పగా.. తిరిగి మమ్మల్ని తిట్టాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వెంటనే చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశామని బంధువులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Mizoram: మిజోరాంలో వంతెన కూలిపోయిన బాధితుల కుటుంబాలకు రూ. 10 లక్షలు ఎక్స్ గ్రేషియా
మరోవైపు ఈ ఘటనపై ప్రిన్సిపాల్ హేమంత్ కుమార్ ఝా మాట్లాడుతూ.. విద్యార్థిని కొట్టిన విషయంలో ఉపాధ్యాయుడిని వివరణ కోరినట్లు తెలిపారు. మొత్తం వ్యవహారంపై విచారణ జరుపుతున్నామన్నారు. పిల్లలు అల్లరి చేస్తున్నందున దీంతో తనకు కోపం వచ్చిందని నిందితుడైన ఉపాధ్యాయుడు పుష్కర్ చౌహాన్ చెబుతున్నాడు. తాను చేయి పట్టుకోగానే కిందపడి గాయపడ్డాడని.. విద్యార్థిని చెప్పుతో కొట్టలేదని తెలిపాడు.
Student Suicide: కాలేజీలోని వాష్‌రూమ్‌లో నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
మరోవైపు పాఠశాలలో విద్యార్థి గాయపడిన విషయాన్ని ఎస్పీ సిటీకి తెలియజేయగా.. టీచర్ కొట్టడంతో విద్యార్థి గాయపడినట్లు సమాచారం అందిందని ఎస్పీ సిటీకి తెలిపారు. ఈ విషయమై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం ఎపిసోడ్లో చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని పేర్కొన్నారు.