అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా ‘గంగోత్రి’ 2003లో రిలీజ్ అయింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు.. అసలు బన్నీది హీరో కటౌటేనా? అని పెదవి విరిచారు చాలామంది. ఇక్కడే బన్నీని తక్కువ అంచనా వేశారు. ఎందుకంటే.. ఇప్పటి వరకు ఎందరో స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ అయ్యారు. మిగతా వాళ్లు ఫేడవుట్ అయిపోయారు. బన్నీని కూడా ఈ లిస్ట్‌లోనే పడేశారు. తండ్రి అల్లు అరవింద్ స్టార్ ప్రొడ్యూసర్… పైగా మెగా బ్రాండ్ కదా… అతనికేం కష్టం? ఎందుకు హార్డ్ వర్క్ చేస్తాడులే అని అనుకున్నారు కానీ అక్కడుంది గాండీవధారి ధరించిన అల్లు అర్జున్. కామెంట్సే కాదు ఫెయిల్యూర్‌ను కూడా అంత ఈజీగా వదిలిపెట్టలేదు. అందుకే సెకండ్ సినిమా ‘ఆర్య’తో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ సినిమాతోనే సుకుమార్ డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు.
అసలు గంగోత్రిలో చూసిన బన్నీ… ఆర్యలో చూసిన బన్నీ ఒక్కడేనా అనేలా అందరి నోర్లు మూయించాడు. అక్కడి నుంచి స్టైలిష్ స్టార్‌గా 2021 వరకు 20 సినిమాలు చేశాడు బన్నీ. తనకంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రతి సినిమాను ఫస్ట్ సినిమాలా భావిస్తూ… 20 ఏళ్లలో 20 సినిమాలు చేసిన బన్నీ.. ఒక తెలుగు నటుడిగా 69 ఏళ్ల కలను సాకారం చేశాడు. ఇప్పటి వరకు ఒక్క తెలుగు హీరో కూడా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డ్ అందుకోలేదు, ఇప్పుడు పుష్ప సినిమాతో అల్లు అర్జున్ చరిత్ర తిరగరాశాడు. తాజాగా ప్రకటించిన 69వ నేషనల్ అవార్డ్స్‌లో పుష్ప సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడు. ఎవ్వరైతే గంగోత్రి సమయంలో బన్నీని హీరో కాదని అన్నారో… వాళ్లే ఇప్పుడు బన్నీని ఆకాశానికెత్తుస్తున్నారు. కథ ఇక్కడితో అయిపోలేదు, ఆగిపోలేదు… అసలు కథ ఇప్పుడే స్టార్ట్ అయింది.
అల్లు అర్జున్ చేయాల్సింది ఇంకా చాలా ఉందని… పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ రేంజ్లో సినిమాలు చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సన్నిహిత అంటున్నారు. ఇక సుకుమార్, బన్నీది డెడ్లీ కాంబినేషన్. సుకుమార్ లేకుంటే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని చెబుతునే ఉంటాడు బన్నీ. ఈ ఇద్దరు కలిసి ఆర్య, ఆర్య2, పుష్ప సినిమాలు చేశారు. బన్నీని స్టైలిష్ స్టార్ చేసిన సుకుమార్.. పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ బిరుదు ఇచ్చాడు. అంతేకాదు.. పాన్ ఇండియా హీరోగా బన్నీని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేందుకు ట్రై చేస్తున్నాడు. పుష్ప2 సినిమాతో బన్నీ క్రేజ్ మామూలుగా ఉండదని.. నేషనల్ అవార్డ్‌తో చెప్పేశాడు. పుష్ప2 తర్వాత త్రివిక్రమ్‌తో భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. ఆ తర్వాత సాలిడ్ లైనప్ సెట్ చేసే పనిలో ఉన్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.