Leading News Portal in Telugu

Weight Loss: క్యాప్సికం రసం.. బరువు తగ్గేందుకు అద్భుత మంత్రం


Weight Loss: ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. దీని కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. బరువు ఎక్కువగా పెరగడం వల్ల శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోయి అనేక సమస్యలు వస్తున్నాయి. ఇవి కొన్ని సార్లు ప్రాణాల మీదకు కూడా తెస్తున్నాయి. అధికంగా కొవ్వు ఉండటం గుండె జబ్బులు, కాలేయ సమస్యలకు కూడా దారి తీయవచ్చు. దీంతో కొవ్వును తగ్గించుకోవడం కోసం జిమ్ లకు వెళ్లడం, యోగా చేయడం, జాగింగ్, రన్నింగ్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఫిట్ నెస్ పై అందరికి ఇంట్రస్ట్ పెరిగింది. బిజీగా ఉన్నా కూడా తమ బాడీని కరెక్ట్ గా మెయిన్టేన్ చేయాలని కోరుకుంటున్నారు.  చాలా మంది ఇవన్నీ చేయడం కుదరక డైట్ ద్వారానే బరువు తగ్గాలనుకుంటున్నారు. ఇక అలాంటి వారి కోసం చాలా డైట్ లు ఉన్నాయి. కిటో డైట్ వాటిలో ఒకటి. ఇక కొంతమంది పూర్తిగా రైస్ మానేసి కూరగాయలు, పండ్లు లాంటివే తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది బరువు తగ్గించే జ్యూస్ లు తాగడానికి ప్రయత్నిస్తుంటారు. ఇక అలాంటి జ్యూస్ కోసమే మీరు కనుక చూస్తున్నట్లయితే ఈ ప్రత్యేకమైన జ్యూస్ మీకోసమే. వినడానికి కొంచెం కొత్తగా ఉన్నా, ఈ జ్యూస్ తాగితే ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి.

ఈ జ్యూస్ చేసుకోవడానికి మనకి క్యాప్సికమ్ లు కావాలి. అవును కొన్ని రకాల కూరగాయలను జ్యూస్ చేసుకున్నట్లే క్యాప్సికమ్ ను కూడా జ్యూస్ చేసుకోవచ్చు. దీని కోసం క్యాప్సికమ్ ను ముక్కలుగా కోసి నీరు పోసి ఒక పదినిమిషాలు నానబెట్టాలి. తరువాత నీటిని తీసేసి ఒక పదిహేను నిమిషాలు ఆరబెట్టాలి. అనంతరం దానిని జ్యూస్ గా చేసుకొని తాగేయాలి. దానిలో కొంచెం తేనే కలిపితే తాగడానికి బాగుంటుంది. ఇది తాగడానికి కొంచెం కష్టంగా ఉన్నా మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు పది రోజుల్లోనే కరిగించేస్తోంది. మీ బరువును సులువుగా తగ్గించేస్తోంది. రోజుకు ఒక గ్లాస్ ఈ జూస్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా బరువు తగ్గాలంటే ఈ జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోవడం ద్వారా మంచి ప్రయోజనాలను పొందవచ్చు.