Leading News Portal in Telugu

Virat Kohli Yo Yo Test: యో-యో టెస్టు పాసైన విరాట్ కోహ్లీ.. సంతోషం పట్టలేక..!


irat Kohli Reveals his Yo Yo test score ahead of Asia Cup 2023: ఫిట్‌నెస్‌కు మారుపేరు టీమిండియా స్టార్ బ్యాటర్ ‘విరాట్ కోహ్లీ’. శారీరక దృఢత్వంపై కోహ్లీకి ఎనలేని నమ్మకం. భారత జట్టు సభ్యులంతా 2-3 గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ మాత్రం 4 గంటలు చేస్తాడు. ఎక్కువ సమయం జిమ్‌లో గడుపుతూ.. శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుని అందరికీ స్ఫూర్తిగా నిలిచాడు. కింగ్ కోహ్లీని చూసి చాలామంది భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించారు. సీనియర్లు జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మనీష్ పాండే, శిఖర్ ధావన్, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మొహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్.. యువకులు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, శుభ్‌మ‌న్ గిల్ కూడా విరాట్‌ను చూసే సిక్స్ పాక్ చేసారు.

విరాట్ కోహ్లీ తన శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకుంటాడు కాబట్టే.. పదిహేనేళ్ల కెరీర్‌లో అతడు ఏనాడూ ఫిట్‌నెస్‌ సమస్యలు ఎదుర్కోలేదు. ఫిట్‌నెస్‌ లేమి, గాయాల కారణంగా జట్టుకు దూరమైన సందర్భాలు లేనే లేవు. ప్రతి సిరీస్ ముందు బీసీసీఐ నిర్వహించే యో-యో టెస్టులో మనోడిదే టాప్ స్కోర్ ఉంటుంది. అలాంటి కోహ్లీ కూడా తాను ఫిట్‌నెస్‌ టెస్ట్ పాస్ అయ్యానని సంతోషపడుతూ తాజాగా వెల్లడించాడు. ఆలూరులో నిర్వహించిన యో-యో టెస్టును తాను క్లియర్‌ చేసినట్లు ఇన్‌స్టా స్టోరీలో పేర్కొన్నాడు. యో-యో టెస్టులో 17.1 స్కోర్‌ సాధించినట్లు మైదనంలో నవ్వుతూ ఉన్న ఫొటో పంచుకున్నాడు.

వెస్టిండీస్‌ పర్యటన అనంతరం స్టార్ బ్యాటర్ విరాట్‌ కోహ్లీ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులు ముంబైలో తన కుటుంబసభ్యులతో సంతోషంగా గాడిపాడు. ఇక ఆగష్టు 30 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌ 2023 టోర్నీకి సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో భారత ఆటగాళ్లతో పాటు అతడు బెంగళూరుకు చేరుకున్నాడు. ఎన్సీఏలో వారం రోజుల పాటు జరుగనున్న ట్రెయినింగ్‌ క్యాంపులో భాగం అయ్యాడు. ఈ సందర్భంలోనే ఫిట్‌నెస్‌ టెస్టు పాస్ అయ్యాడు. ఇందుకు సంబదించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Kohli Yo Yo

Kohli Yo Yo