జనాలు టెక్నాలజీతో పోటి పడుతూ కొత్త కొత్త వాటిని తీసుకొస్తూ జనాలను ఆశ్చర్య పరుస్తున్నారు.. మనుషులతో సమానంగా మర మనుషులు అందుబాటులోకి వస్తున్నారు.. అదేనండి రోబోలు.. మనిషి తన అవసరాలకు రోబోలను తయారు చేస్తున్నారు.. ఆటోమేటెడ్ ఫ్లోర్ క్లీనర్ల నుండి ఇంట్లో పనిచేసే వారి వరకు అవకాశాల శ్రేణి అనంతం. అలాంటి సందర్భానికి చక్కటి ఉదాహరణ ఈ వీడియో.. ఇంటర్నెట్‌లో విపరీతంగా చక్కర్లు కొడుతుంది. వీడియోలో ఒక వ్యక్తి రోబోతో జుట్టు కత్తిరించుకున్నాడు. వీడియో చూసిన జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం స్టఫ్ మేడ్ హెయిర్ అనే యూట్యూబ్ ఛానెల్‌లో డిస్‌రప్ట్ ద్వారా ఈ వీడియోను మొదట పోస్ట్ చేశారు.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
అయితే ఈ వీడియో అమెరికాకు చెందిందని తెలుస్తుంది..ఇంజనీర్ షేన్ డిస్‌ప్రప్ట్ తన హెయిర్‌కట్‌ను అతను స్వయంగా తయారు చేసిన ప్రత్యేక రోబోట్‌తో చేయించుకుంటున్నాడు. అయితే, సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావటంతో నెటిజన్లు భిన్నమైన అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ వీడియోను పోస్ట్ చేస్తూ, ఇటువంటి యంత్రం అవకాశాలు అంతులేనివని చెప్పారు.. మనిషికి కష్టమైన కూడా ఈ రోబోలు సులువుగా చెయ్యడం విశేషం..
ఇక ఈ వీడియోను పోస్ట్ చేస్తూ అతను ఏం రాశాడంటే.. నేను దీనిని మొదటి తరం యంత్రంగా భావిస్తున్నాను, జుట్టు కత్తిరించుకోవటం కోసం కొన్ని ప్రత్యేకమైన స్టైల్స్‌ని ఎంపిక చేయటం కోసం మరోక యంత్రాన్ని తయారు చేయాలనుకుంటున్నాను అని…నేను దీన్ని నిజంగా ‘ఎంజాయ్’ చేస్తున్నాను అని చెప్పారు. నిజానికి ఇది పాత న్యూస్ అయిన ఇప్పుడు పెరుగుతున్న టెక్నాలజీ ప్రకారం ఇది ట్రెండ్ అవుతుంది.. నిజంగా హెయిర్ కట్ లు కూడా చేస్తే ఇక మనుషులు మరీ సోమరులు అవ్వడం ఖాయం.. ఇంక ముందు ఏం వస్తాయో చూడాలి..