అప్పన్న దర్శనం చేయిస్తానని భక్తుడికి టోకరా వేసాడు ఓ కేటుగాడు..హైదరాబాద్ నుంచి కుటుంబసమేతంగా దర్శనానికి వచ్చిన శ్రీరామమూర్తి అనే భక్తుడు కీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వీఐపీ దర్శనం కల్పిస్తానని చెప్పి ఓ అజ్ఞాత వ్యక్తి మోసం చేసాడు.. హైదరాబాద్ నుంచి శ్రీరామమూర్తి తన భార్య, కుమారుడితో కలిసి శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో సింహగిరికి వచ్చారు.. పాత విచారణ కార్యాలయం వద్ద వారిని ఓ అజ్ఞాత వ్యక్తి కలిసి వీఐపీ దర్శనం, ఆశీర్వచనం, ప్రసాదం అంద జేస్తానని చెప్పి రూ.900 తీసుకున్నాడు.. అక్కడే ఉండమని చెప్పి వెళ్లాడు. అతని కోసం ఎదురుచూసిన శ్రీరామమూర్తి ఎంతకీ రాకపోయేసరికి.. సింహగిరిపై ఉన్న సహాయక కేంద్రంలో ఫిర్యాదు చేసాడు.. సిబ్బంది సింహగిరిపై అతని కోసం గాలించారు. ఫలితం లేకపోయింది. అతన్ని గుర్తించేందుకు దేవస్థానం సిబ్బంది సీసీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు… ఇటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామంటున్నరు దేవస్థానం అధికారులు.
ఇదిలా ఉంటే.. టాస్క్ గేమ్స్ పేరిట ప్రలోభాలకు గురిచేసి మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టు రట్టు చేశారు. దీనిపై విశాఖ నగర పోలీస్ కమిషనర్ త్రివిక్రమ వర్మ మీడియాకు వివరాలు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశామని చెప్పారు. టాస్క్ గేమ్స్ పేరుతో ఈ సంవత్సరం రూ.9 కోట్లకు పైగా కాజేశారని వెల్లడించారు. నిందితులకు మలేషియా నుంచి ఆదేశాలు అందుతున్నట్టు గుర్తించామని పేర్కొన్నారు.