Leading News Portal in Telugu

Prabhas: సలార్ ట్రైలర్… రెండు నిమిషాలు విధ్వంసమే



Salaar

బాహుబలి తర్వాత ప్రభాస్‌కు ఒక్క సాలిడ్ హిట్ కూడా పడలేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు డిసప్పాయింట్ చేశాయి. అందుకే.. ఈ మూడు సినిమాల ఆకలి తీర్చేందుకు.. ట్రిపుల్ రేట్ వడ్డీతో సహా ఇచ్చేందుకు వస్తోంది సలార్. సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ పై దండయాత్ర చేయడానికి వస్తున్నాడు ప్రభాస్. దానికి ఇంకా నెల రోజుల సమయం ఉంది. కానీ ఈలోపు ట్రైలర్ విధ్వంసం సృష్టించబోతోంది. సలార్ ట్రైలర్‌ను సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో 3 లేదా 7వ తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ వీక్‌లో సలార్ ట్రైలర్ అప్డేట్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. అలాగే హై ఓల్టేజ్ ట్రైలర్ కట్‌ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే సలార్ టీజర్‌ ఒక నిమిషం 46 సెకన్లుగా కట్ చేసి.. డైనోసార్ అంటూ ఇచ్చిన ఎలివేషన్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గూస్ బంప్స్ తెప్పించింది. దీంతో ఇప్పుడు సలార్ టైలర్‌ రన్ టైం ఎంత? అనేది ఎగ్జైటింగ్‌గా మారింది.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. సలార్ ట్రైలర్ రన్ టైం రెండు నిమిషాల 20 సెకన్లుగా లాక్ చేసినట్టు తెలుస్తోంది.  అంటే.. టీజర్ కంటే దాదాపు 35 సెకన్లు ఎక్కువ అన్నమాట. మొత్తంగా సలార్ ట్రైలర్ 140 సెకన్లకు అటు ఇటుగా నిడివితో రానుందని సమాచారం. ఇక ఈ ట్రైలర్‌లో ప్రభాస్‌కు ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఓన్లీ యాక్షన్ షాట్స్‌తోనే ట్రైలర్ నింపేశాడట ప్రశాంత్ నీల్. ఖచ్చితంగా సలార్ ట్రైలర్ అంచనాలకు మించి ఉంటుందని.. సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నీ ఈ ట్రైలర్ తుడిచిపెట్టుకుపోవడం గ్యారెంటీ అంటున్నారు. మరి సలార్ ట్రైలర్ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.