Leading News Portal in Telugu

Pebble Smart Watch Price: వాయిస్‌ కాలింగ్‌తో సరికొత్త స్మార్ట్‌ వాచ్‌.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!


Pebble Game of Thrones Smart Watch Price and Features in India: స్మార్ట్‌వాచ్‌ల తయారీ సంస్థ ‘పెబల్‌’ మరో సరికొత్త స్మార్ట్‌ వాచ్‌ను భారత్‌ మార్కెట్‌లో శుక్రవారం రిలీజ్ చేసింది. అదే ‘గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌’ స్మార్ట్‌ వాచ్‌. గత జులైలో కాస్మోగ్‌ వోగ్ పేరిట స్మార్ట్‌ వాచ్‌ను తీసుకొచ్చిన పెబల్‌.. ఇప్పుడు గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ పేరిట మరో వాచ్‌ను విడుదల చేసింది. పెబుల్ మరియు వార్నర్ బ్రదర్స్ కలిసి ఈ స్మార్ట్‌ వాచ్‌ను రిలీజ్ చేశాయి. సెవెన్ కింగ్‌డమ్స్ నుంచి ప్రేరణ పొంది.. స్మార్ట్‌ వాచ్‌లను పెబుల్ పరిచయం చేసింది. పెబల్‌ అధికారిక వెబ్‌సైట్‌, అమెజాన్‌ వెబ్‌సైట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.

పెబల్ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ స్మార్ట్‌ వాచ్‌ ధర రూ. 5,499గా ఉంది. బ్లాక్, గ్రే, గోల్డ్‌ రంగుల్లో ఈ వాచ్‌లు అందుబాటులో ఉంటాయి. 1.43 ఇంచెస్ అమోల్డ్‌ డిస్‌ప్లేతో రానున్న ఈ వాచ్‌.. 250mAh బ్యాటరీతో వస్తుంది. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే.. ఏడు రోజుల పాటు వస్తుంది. మ్యాగ్నెటిక్‌ ఛార్జింగ్‌ సదుపాయాన్ని ఇందులో ఇస్తున్నారు. ఈ స్మార్ట్‌ వాచ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. మొబైల్‌ ఫోన్‌లోని బ్లూటూత్‌ కనెక్షన్ ద్వారా ఫోన్‌కు వచ్చే కాల్స్‌ని లిఫ్ట్‌ చేసి. వాచ్‌లో ఉన్న మైక్రోఫోన్ ద్వారా ఫోన్‌ మాట్లాడొచ్చు.

పెబల్ గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌ స్మార్ట్‌ వాచ్‌లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఎస్పీ ఓ2 (బ్లడ్ ఆక్సిజన్), హెచ్‌ఆర్ (హార్ట్‌ రేట్‌), స్లీప్‌ మానిటరింగ్‌ లాంటి హెల్త్‌ ట్రాకర్స్‌ అందులో ఉన్నాయి. వందకు పైగా స్పోర్ట్స్ మోడ్స్‌, ఫిట్‌నెస్‌ యాక్టివిటీ ట్రాకర్లను కూడా అమర్చారు. కాలిక్యులేటర్ యాప్, అలారం క్లాక్‌, స్టాప్‌ వాచ్‌, మ్యూజిక్‌ కంట్రోల్స్ కూడా ఈ వాచ్‌లో ఉన్నాయి. నీరు, దుమ్ముకు రక్షణగా IP67 రేటింగ్‌ ఉంది. ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లకు ఈ వాచ్‌ సపోర్ట్‌ చేస్తుంది.