Leading News Portal in Telugu

Actor Suman: ఇండో-బ్రిటీష్ పెయిన్ క్లినిక్ లోగోను ఆవిష్కరించిన సినీ నటుడు సుమన్


ఈ రోజు ప్రముఖ సినీ నటుడు సుమన్ తల్వార్ జన్మదిన వేడుకలు సోమజిగూడ ప్రెస్ క్లబ్ లో హాట్టహసంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఇండో బ్రిటీష్ పెయిన్ క్లినిక్ లోగో మరియు వీడియో లంచ్ డాక్టర్ విజయ భాస్కర్ బండికట్ల ఆధ్వర్వంలో సుమన్ తల్వార్ చేతుల మీదుగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ హీరో భానుచందర్ ముఖ్య అతిథిగా విచ్చేసి పెయిన్ ట్రీట్మెంట్ యొక్క అవసక్యత, తనకు జరిగిన ఉపశమం గురించి ప్రశంసించారు.

విజయవంతమైన చంద్రయాన్-3లో ఆధునాతన పరికరాలను అందించిన సోలార్ సైంటిస్ట్ రమేష్ ని సత్కరించడం జరిగింది. హీరో సుమన్ ఇండో బ్రిటీష్ అడ్వాన్స్ పెయిన్ క్లినిక్ యొక్క చికిత్స విధానాల ద్వారా సర్జరీతో పని లేకుండా ఎన్నో రకాల నొప్పులను దీర్ఘకాలిక ఉపశమనం అందించే ఈ సరికొత్త వైద్య విధానం పట్ల అవగాహన పెంచాలి అన్నారు. ఈ నూతన విధానాల వల్ల క్లిష్టమైన సర్జరీలతో వచ్చే ఎన్నో ఇబ్బందులను సులువుగా సమర్థవంతమైన చికిత్సలతో అధిగమించవచ్చని ఆయన అన్నారు.