Leading News Portal in Telugu

Asia Cup 2023: పాకిస్థాన్ కు బీసీసీఐ పెద్దలు..!


బీసీసీఐ అధ్యక్షుడు రోజర్‌ బిన్నీ, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా దాయాది దేశమైన పాకిస్తాన్‌కు వెళ్లనున్నారు. ఆసియా కప్‌-2023 ప్రారంభ వేడులకు హాజరు కావాలని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు పంపిన ఆహ్వానం మేరకు వీరిరువురు పాక్ కు పయనం కానున్నారు. పీసీబీ వీరిద్దరితో పాటు బీసీసీఐ కార్యదర్శి జై షాకు కూడా ఆహ్వనం పంపించింది. అతను లాహోర్‌కు వెళ్లేందుకు నిరాకరించాడు. దీంతో అక్టోబర్‌ 30న రోజర్‌ బిన్నీ, రాజీవ్‌ శుక్లాలు మాత్రమే పాకిస్థాన్ కు వెళ్లనున్నారు.

కాగా, ఈ ఏడాది ఆసియా కప్‌కు పాకిస్తాన్‌, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. తొలుత ఈ టోర్నీకి పాక్‌ ఒక్కటే ఆతిథ్యం ఇవ్వాల్సి ఉనప్పటికీ.. భారత క్రికెట్‌ జట్టు పాక్‌లో అడుగు పెట్టదని బీసీసీఐ అధికారులు తేల్చి చెప్పడంతో టోర్నీని హైబ్రిడ్‌ పద్ధతిలో నిర్వహించాలని ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది. దీంతో భారత్‌ ఆడే మ్యాచ్‌లకు శ్రీలంక ఆతిథ్యంగా మారింది.

ఇదిలా ఉంటే, ఆసియా కప్‌లో తొలి మ్యాచ్‌ ఈ నెల 30న స్టార్ట్ కానుంది. ముల్తాన్‌లో జరిగే ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ –నేపాల్‌ జట్లు పోటీ పడబోతున్నాయి. ఈ మెగా టోర్నీలో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ సెప్టెంబర్‌ 2న జరుగుతుంది. ఈ మ్యాచ్‌కు పల్లెకెలె మైదానం ఆతిథ్యమిస్తుంది. అనంతరం సెప్టెంబర్‌ 4 టీమిండియా.. నేపాల్‌తో మ్యాచ్‌ ఆడనుంది. సెప్టెంబర్‌ 17న జరిగే ఫైనల్‌తో ఆసియాకప్‌ టోర్నమెంట్ ముగుస్తుంది. అనంతరం భారత్‌ వేదికగా అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో వన్డే ప్రపంచకప్ జరుగునుంది.