Leading News Portal in Telugu

Keerthy Suresh: పబ్ లో మహానటి.. ఆ పని చేస్తూ


Keerthy Suresh: నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకున్న కీర్తి.. ఈ సినిమా తరువాత స్టార్ హీరోల సరసన నటించిన ఆమె .. ఏ హీరోయిన్ అందుకొని గోల్డెన్ ఛాన్స్ ను అందుకుంది. మహానటి సావిత్రి బయోపిక్ లో నటించే అవకాశం అందకుది. నిజంగా సావిత్రి ఇలానే ఉండేదేమో అని ఇప్పటితరం యువత అనుకొనేలా చేసింది. ఇక ఈ సినిమాతో జాతీయ అవార్డును సైతం అందుకుంది. ఇక ఏ ముహూర్తాన ఈ సినిమా విజయవంతం అయ్యిందో.. ఆ తరువాత నుంచి కీర్తికి అవకాశాలు అయితే వచ్చాయి కానీ, అలాంటి విజయం మాత్రం అందలేదు. ఇక ఈ మధ్యనే దసరా సినిమాతో అంతటి విజయం కాకపోయినా.. వెన్నెలగా ఆమె నటనను మాత్రం మర్చిపోలేరని చెప్పొచ్చు.

Skanda Trailer: రామ్ నట విశ్వరూపం.. బోయపాటి మాస్ మార్క్.. థియేటర్ దద్దరిల్లడమే

మహానటి తరువాత బక్కచిక్కిన కీర్తి.. సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్ లు చేస్తూ కుర్రకారును కిర్రెక్కిస్తుంది. తాజాగా కీర్తి పబ్ లో చిందేస్తూ కనిపించింది. ఫ్రెండ్స్ తో ఆమె పబ్ లో ఛిల్ల్ అవుతూ కనిపించింది. స్లీవ్స్ టాప్.. వేసుకొని కీర్తి అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో కీర్తి.. సూపర్ అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం కీర్తి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరి ఈ సినిమాలు .. కీర్తికి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.