ఆసియా కప్-2023 టోర్నీకి టైం ఆసన్నమైంది. పాకిస్తాన్ వేదికగా ఆగష్టు 30న ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది. ముల్తాన్ క్రికెట్ స్టేడియంలో పాకిస్థాన్- నేపాల్ మ్యాచ్‌తో ఆసియా కప్ కు టోర్నో స్టార్ట్ కానుంది. ఇక హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తున్న ఈ వన్డే టోర్నమెంట్ లో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఈ క్రమంలో సెప్టెంబరు 2న దాయాది జట్టుతో టీమిండియా ఈవెంట్‌లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. పల్లకెలె వేదికగా ఈ హై వోల్టేజ్ మ్యాచ్ జరుగనుంది. అయితే, ఈ కీలక పోరుకు భారత జట్టు స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండటం లేదు. ఈ విషయాన్ని బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వెల్లడించారు. పాకిస్తాన్‌తో మ్యాచ్ నాటికి రాహుల్ అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నాడు.
అయితే, శ్రేయస్ అయ్యర్ విషయంలో మాత్రం బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ న్యూస్ చెప్పాడు. ఆసియా కప్ కు టీమ్ ను ప్రకటించిన సందర్భంగా అగార్కర్ మాట్లాడుతూ.. శ్రేయస్ అయ్యర్ పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు క్లారిటి ఇచ్చాడు. అయితే, భారత జట్టుకు ఇదొక గొప్ప న్యూస్.. ఇక కేఎల్ రాహుల్‌ను మాత్రం గాయం వెంటాడుతోంది.. ఆసియా కప్‌లో టీమిండియా రెండు లేదంటే మూడో గేమ్ నాటికి అతడు పూర్తిగా అందుబాటులోకి రావొచ్చు అని అతడు వెల్లడించాడు.
కాగా, ఐపీఎల్-2023లో కేఎల్ రాహుల్ గాయపడి.. జర్మనీలో సర్జరీ చేయించుకున్నాడు. ఈ క్రమంలో బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రాకిస్ట్ చేస్తున్నాడు.. అయితే, ఇంకా వంద శాతం ఫిట్‌నెస్ పొందలేదని తాజాగా అజిత్ అగార్కర్ మాటల్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ సైతం వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తీసుకుని వచ్చాడు. ఇదిలా ఉంటే.. కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్‌ను ట్రావెలింగ్ స్టాండ్‌బైగా బీసీసీఐ యాజమాన్యం ఎంపిక చేసింది. పాకిస్తాన్ తర్వాత టీమిండియా సెప్టెంబరు 4న నేపాల్‌తో మ్యాచ్ ఆడనుంది.