Leading News Portal in Telugu

BRO : ఓటీటీ లో అదరగొడుతున్న పవర్ ప్యాక్డ్ మూవీ..


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కలిసి నటించిన మూవీ బ్రో. ఈ సినిమా జూలై 28న థియేటర్లలో విడుదల అయి మంచి విజయం సాధించింది.బ్రో చిత్రాన్ని విలక్షణ నటుడు మరియు దర్శకుడు సముద్రఖని దర్శకత్వం వహించారు. తాను తమిళం లో తెరక్కించిన వినోదయ సిత్తంకు రీమేక్‍గా తెలుగులో బ్రో సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ మూవీ కి కొన్ని మార్పులు చేసిన పవన్ కల్యాణ్‍కు తగ్గట్టుగా దర్శకుడు త్రివిక్రమ్ అదిరిపోయే స్క్రీన్ ప్లే అందించారు. అలాగే బ్రో చిత్రాని కి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందించారు.బ్రో సినిమాలో టైం ఆఫ్ గాడ్ గా పవన్ కల్యాణ్ నటించారు. ఆయన వింటేజ్ గెటప్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ గా నిలిచాయి. ఈ సినిమా లో సాయి ధరమ్ తేజ్‍ సరసన ఈ మూవీలో కేతిక శర్మ నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమా ను ఎంతో గ్రాండ్ గా నిర్మించారు.

ఎంతో గ్రాండ్ విడుదల అయిన బ్రో సినిమా పవర్ స్టార్ అభిమానులకు ఎంతగానో నచ్చేసింది. వింటేజ్ పవన్‍ ను చూసి వారు ఎంతగానో సంతోషించారు. ఇదిలా ఉంటే బ్రో సినిమా ఇటీవలే ఓటీటీ లో విడుదల అయింది.. ఆగస్టు 25 వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ లో బ్రో మూవీ స్ట్రీమ్ అవుతుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతుంది.బ్రో సినిమాకు ఓటీటీలో నేషనల్ వైడ్‍గా మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో ఇండియాలో టాప్ ట్రెండింగ్ మూవీల జాబితా లో ఈ సినిమా ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది .నెట్‍ఫ్లిక్స్‌లో నేషనల్ వైడ్‍గా ప్రస్తుతం టాప్ ట్రెండింగ్ మూవీ గా బ్రో మూవీ నిలిచింది.. నెట్‍ఫ్లిక్స్‌లో తెలుగు తో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో నూ బ్రో చిత్రం స్ట్రీమింగ్‍ అవుతుంది.