Basmati Rice: దేశవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం అనేక ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ప్రభుత్వం ప్రీమియం బాస్మతీ బియ్యం ముసుగులో తెలుపు బాస్మతీయేతర బియ్యం ‘అక్రమ’ ఎగుమతిని ఆపడానికి కేంద్రం కట్టడి చర్యలు ప్రారంభించింది. టన్నుకు 1,200 డాలర్ల కంటే తక్కువ ఖరీదైన బాస్మతి బియ్యం ఎగుమతి అనుమతించకూడదని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం బియ్యం ధరలపైనా ప్రభావం చూపనుంది. బాస్మతి యేతర తెల్ల బియ్యాన్ని హెచ్ఎస్ కోడ్స్ ఆఫ్ పార్‌బాయిల్డ్ రైస్, బాస్మతి రైస్ కింద ఎగుమతి చేస్తున్నట్టు గుర్తించామని కేంద్రం తెలిపింది. దేశీయంగా ధరల కట్టడికి, ఆహార భద్రత కోసం జులై మూడో వారంలో బాస్మతి యేతర తెల్ల బియ్యం ఎగుమతులపై నిషేధం అమలు చేసింది.
వాణిజ్య మంత్రిత్వ శాఖ నుంచి అందిన సమాచారం ప్రకారం.. అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ (APEDA) టన్నుకు 1,200 డాలర్ల కంటే తక్కువ ఒప్పందాలను నమోదు చేయకూడదని కేంద్రం ఆదేశించింది. ప్రస్తుతం టన్ను 1,200 డాలర్ల కంటే తక్కువ ఉన్న ఒప్పందాలు నిలిపివేయబడ్డాయి. బాస్మతీ బియ్యం ముసుగులో బాస్మతీయేతర బియ్యం అక్రమంగా ఎగుమతి కాకుండా నిరోధించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులను నియంత్రించే ఈ అథారిటీకి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తు కోసం, APEDA అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయవచ్చని సూచనలు చేసింది. బియ్యం రిటైల్ ధరలను నియంత్రించే ప్రయత్నంలో, దేశీయ సరఫరాలను పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది.
గతేడాది సెప్టెంబరులో పగిలిన బియ్యం ఎగుమతిపై నిషేధం విధించగా, గత నెలలో బాస్మతీయేతర తెల్ల బియ్యంపై నిషేధం విధించింది. గత వారం బాస్మతియేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించారు. ఈ పరిమితులతో భారతదేశం ఇప్పుడు అన్ని రకాల బాస్మతీయేతర బియ్యాన్ని కూడా నిషేధించింది. వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం, బాస్మతి బియ్యం ముసుగులో తెల్ల బాస్మతీయేతర బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేయడాన్ని నివారించడానికి అదనపు రక్షణలను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం APEDAకి ఆదేశాలు జారీ చేసింది. టన్నుకు 1200 డాలర్లు, ఆపైన విలువ కలిగిన బాస్మతి బియ్యం ఎగుమతుల కాంట్రాక్టులకు మాత్రమే రిజిస్ట్రేషన్ కమ్ అల్లోకేషన్ సర్టిఫికేట్ (RCAC) జారీకి నమోదు చేయాలని ఏపీఈడీఏకి ప్రభుత్వం సూచించింది. ఇక టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన కాంట్రాక్ట్రులను నిలిపేయవచ్చు.