Leading News Portal in Telugu

CM Jagan : వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి జగన్ సమీక్ష


వైద్య, ఆరోగ్య శాఖపై నేడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పనుల పురోగతి, ఆరోగ్య శ్రీ అమలు తీరు, ఖాళీ పోస్టుల నియామకం, హాస్పిటల్స్ లో నాడు – నేడు తదితర అంశాలపై సీఎం సమీక్షించనున్నారు. ఇదిలా ఉంటే… ఏపీలో అర్హులై ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ కారణాల వల్ల పలు పథకాలు అందని వారి ఖాతాల్లో నేడు నగదు జమ చేయనున్నారు. డిసెంబర్ 2022- జూలై 2023 మధ్య కాలంలో పథకాలు అందని 2,62,169 మందిని గుర్తించారు. వీరి ఖాతాల్లో రూ.216.34కోట్లను తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ వర్చువల్‌గా బటన్ నొక్కి జమ చేయనున్నారు.

అయితే.. అర్హులై ఉండి కూడా సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందని వారు ఆయా పథకాలను అందించిన నెల­లోపు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసు­కోవాలి. వెరిఫికేషన్‌ అనంతరం.. మిగిలిపోయిన అర్హులకు కూడా ఆర్నెళ్లకు ఒకసారి ప్రభుత్వం ప్రయో­జనాన్ని చేకూరుస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్‌ ఆడిట్‌ కోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను ప్రద­ర్శిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తోంది.

అయితే.. ఇటీవల కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌కు పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణ పనుల పురోగతిని అధికారులు వివరించారు. రామాయపట్నం పోర్టులో సౌత్‌ బ్రేక్‌ వాటర్‌, నార్త్‌ బ్రేక్‌ వాటర్‌ పనులు దాదాపుగా పూర్తి అయినట్లు తెలిపారు. రామాయపట్నం పోర్టు మొత్తం నిర్మాణ వ్యయం అంచనా రూ. 3,736 కోట్లు. తొలిదశలో నిర్మిస్తున్న ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణాలపై సీఎం సమీక్షించారు.