Nandamuri Mokshagna:నందమూరి నటసింహం బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ కోసం సినిమా ఇండస్ట్రీ మొత్తం 1000 కళ్ళతో ఎదురుచూస్తుందని చెప్పాలి. ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ ఇండస్ట్రీలో అడుగుపెడతాడా..? అని నందమూరి ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ, అది మాత్రం జరగడం లేదు. గత కొన్నేళ్లుగా బాలకృష్ణ.. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఏదో ఒక విషయం చెప్తూనే ఉన్నాడు. త్వరలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని, ఒక మంచి డైరెక్టర్ తో ఎంట్రీ ఇస్తాడని చెప్తూ అభిమానుల్లో ఆశలు రేపుతూనే ఉన్నాడు. ఇంకోపక్క మోక్షజ్ఞ ఇంకా హీరోకి సరిపడే విధంగా లేడని, బొద్దుగా ఉన్నాడని, లుక్స్ హీరోలా లేవని విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా కొంత టైమ్ తీసుకుని మళ్లీ హీరోలా మారడానికి ప్రయత్నాలు సాగిస్తున్నాడని వార్తలు వచ్చాయి. ఇక ఈ మధ్య మోక్షజ్ఞ లుక్ మొత్తం మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ.. ఇప్పుడు బరువు తగ్గి మంచి లుక్ లో కనిపిస్తున్నాడు.
Kichcha Sudeep: 50 ఏళ్ల వయస్సులో ఆ బాడీ ఏంటీ సామీ..
ఇకపోతే తాజాగా నట వారసుడు తండ్రి సినిమా సెట్ లో ప్రత్యక్షమయ్యాడు. బాలకృష్ణ, కాజల్ జంటగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం భగవంత్ కేసరి. శ్రీలీల ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అక్టోబర్ 19 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజగా ఈ సెట్ లో మోక్షజ్ఞ తళుక్కున మెరిశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. ఇక ఈ సెట్ లో మోక్షజ్ఞ లుక్ మెస్మరైజ్ చేస్తోంది. కుర్ర హీరోకు ఉండాల్సిన లక్షణాలు అన్ని నందమూరి నటవారసుడులో కనిపిస్తున్నాయి. బరువు తగ్గి.. ముఖంలో తేజస్సుతో కళకళలాడుతున్నారు. ఇక గాగుల్స్ పెట్టుకొని స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలు చూసిన నందమూరి అభిమానులు ఓహో.. పులి యాటకొచ్చే సమయం వచ్చేసింది అంటూ ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు మరి ఈ ఏడాది అయినా నట వారసుడు టాలీవుడ్ లో అడుగుపెడతాడా ..? లేదా.. ? చూడాలి.