తెలుగు చిత్ర పరిశ్రమ లో లవర్ బాయ్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్నారు హీరో తరుణ్. తరుణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించాడు. ఆ తరువాత హీరో గా మారాడు.తన కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సినిమాల లో హీరోగా నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.ఇకపోతే తరుణ్ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో “నువ్వే కావాలి” సినిమా ఒకటి. ఈ సినిమాను దర్శకుడు విజయ భాస్కర్ తెరకెక్కించారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ కి కథ మరియు మాటలు అందించాడు. ఈ మూవీ లో తరుణ్ సరసన రీచా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని ఉషా కిరణ్ మూవీస్ పై రామోజీ రావు,స్రవంతి రవి కిషోర్ నిర్మించారు.2000 వ సంవత్సరం లో విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ సినిమా ను 1.5 కోట్ల తో నిర్మించగా దాదాపు 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధించి అప్పట్లో ట్రెండింగ్ గా నిలిచింది. ఈ సినిమా యూత్ నీ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా అంతటి ఘన విజయం సాధించడం లో మ్యూజిక్ కూడా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమాకు కోటి అందించిన సంగీతం అద్భుతం అని చెప్పాలి. ఈ సినిమా పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.ఇకపోతే ఈ బ్లాక్ బస్టర్ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.. ఈ సినిమాని మరికొన్ని రోజుల్లోనే థియేటర్ లలో 4 కే వర్షన్ తో రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ యూనిట్ తాజాగా అధికారికంగా ప్రకటించింది.మరి ఈ కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అయి ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.