NTR 100 Coin launched by the President of India: టీడీపీ పార్టీ అధినేత, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) శతజయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. సోమవారం ఉదయం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నాణేన్ని విడుదల చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు నందమూరి కుటుంబసభ్యులు నాణెం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు దాదాపు 200 మంది అతిథులు పాల్గొననున్నట్లు సమాచారం. తాజా సమాచారం ప్రకారం.. ఈ వేడుకలకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హాజరుకాలేకపోయారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా నాణెం విడుదల కార్యక్రమానికి ఎన్టీఆర్కి ఆహ్వానం అందినా.. ‘దేవర’ సినిమా షూటింగ్ కారణంగా ఆయన ఢిల్లీ వెళ్లలేకపోయారు.
NTR #NandamuriTarakaRamarao ₹100 Coin officially launched by the President of India at Rashtrapati Bhavan, Delhi in the presence of family members 🔥🔥
JOHAR NTR JOHAR NTR 🙏
— Meg ‘NTR’ (@meghanath9999) August 28, 2023