Japan Warns China: చైనా, జపాన్ దేశాల మధ్య న్యూక్లియర్ వాటర్ చిచ్చు రగులుతోంది. ఈ రెండు దేశాల మధ్య పుకుషిమా అణు కర్మాగారం నుంచి సముద్రంలోకి జపాన్ విడుదల చేయడంతో వివాదం మొదలైంది. ఈ నేపథ్యంలో తాజాగా చైనాలోని జపాన్ రాయబార కార్యాలయంపై రాళ్లదాడి జరిగింది. దీంతో జపాన్, చైనాను తీవ్రంగా హెచ్చరించింది. దౌత్యకార్యాలయాలపై రాళ్లదాడిపై జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా చైనాపై మండిపడ్డారు.
పుకుషిమా అణు కర్మాగారం నుంచి శుద్ధి చేసిన అణు జలాలను జపాన్ పసిఫిక్ సముద్రంలోకి విడుదల చేసింది. జపాన్, యూఎన్ న్యూక్లియర్ వాచ్ డాగా ఈ జనలాలు సురక్షితమని చెప్పినప్పటికీ చైనా మాత్రం తన అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూనే ఉంది. జపాన్ చర్య తర్వాత చైనా ఆ దేశం నుంచి సముద్ర దిగుమతులపై నిషేధం విధించింది.
ఇదిలా ఉంటే చైనాలో ఉండే తమ పౌరులకు జపాన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో జపనీస్ మాట్లాడవద్దని సూచించింది. తాజాగా జపాన్ రాయబార కార్యాలయం, జపనీస్ స్కూళ్లపై రాళ్ల దాడిపై కిషిడా తీవ్రంగా స్పందించారు, చైనా రాయబారిని పిలిచి, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
12 ఏళ్ల క్రితం జపాన్ లో వచ్చిన సునామీ కారణంగా ఈ పుకుషిమా అణుకేంద్రం తీవ్రంగా దెబ్బతింది. సునామీ అలల ధాటికి 3 రియాక్టర్లు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దెబ్బతిన్న అణు కేంద్రం నుంచి ప్లాంట్ ఆపరేటర్ TEPCO ట్రిటియం మినహా అన్ని రేడియోధార్మిక మూలకాలు ఫిల్టర్ చేయబడ్డాయని, వాటి స్థాయిలు సురక్షితంగా ఉన్నాయని జపాన్ తెలిపింది.