Leading News Portal in Telugu

Allu Arjun: నేషనల్ క్రష్ హర్టవ్వుద్దని అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు ఇచ్చేశారా?


Rashmika Mandanna Said she hurts if Allu Arjun Wont get National Award: 2021 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో నేషనల్ అవార్డు సాధించాడు. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఫిలిం అవార్డ్స్ కమిటీ ఈ మేరకు అధికారికంగా ప్రకటించింది. త్వరలోనే ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు తీసుకోబోతున్నారు. అయితే అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అవార్డు రావడంతో ప్రతి తెలుగు వ్యక్తి గర్వంతో ఉప్పొంగుతున్నారు. అయితే అల్లు అర్జున్ నేషనల్ అవార్డు గురించి రష్మిక మందన్న ఎప్పుడో చెప్పిందని సోషల్ మీడియాలో పాత వీడియోలు మరో సారి తెరమీదకు తీసుకొస్తున్నారు. ఆమె అభిమానులు పుష్ప సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత సినిమా యూనిట్ ఒక పెద్ద ఈవెంట్ నిర్వహించింది.

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి ఈ క్వాలిటీస్ ఉన్న అమ్మాయే కావాలట..

ఈ ఈవెంట్ లో రష్మిక మందన్న మాట్లాడుతూ నేనైతే చెబుతున్నానండి, పుష్ప గారికి ఈసారి నేషనల్ అవార్డు కాదు, అన్ని అవార్డులు రాకపోతే ఫస్ట్ హర్ట్ అయ్యేది నేనే అండి అని అంటూ కామెంట్ చేసింది. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ కి బెస్ట్ యాక్టర్ క్యాటగిరీలో నేషనల్ అవార్డు ప్రకటించడంతో ఎక్కడ నేషనల్ రష్మిక వందన హర్ట్ అవుతుందో అని ఆయనకు అవార్డు ప్రకటించేశారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారని అంటున్నారు. ఇక పుష్ప మొదటి భాగంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించింది. ఇక మొదటి భాగం సూపర్ హిట్ కావడమే కాక నేషనల్ అవార్డు కూడా రావడంతో రెండో భాగం మీద చాలా ఫోకస్ పెట్టి పని చేస్తోంది సినిమా యూనిట్. రెండో భాగాన్ని మరపురాని హిట్ గా తీర్చిదిద్దేందుకు సుకుమార్ అండ్ టీం చాలా కష్టపడుతోంది.