Leading News Portal in Telugu

Anu Emmanuel : ఆ రూమర్స్ చూసి మా అమ్మ ఎంతో బాధ పడింది..


అను ఇమ్మానియేల్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నాని హీరోగా మజ్ను సినిమాలో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైంది.ఆ తర్వాత స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్,అల్లు అర్జున్ తో కలిసి నటించిన ఈ భామకు అంతగా కలిసి రాలేదు. ఈ భామకు వరుస ప్లాప్స్ రావడంతో ఈ భామకు అవకాశాలు తగ్గిపోయాయి.ఈ మధ్యకాలంలో ఈ భామ  రావణాసుర,గీత గోవిందం సినిమాలో ఒక చిన్న పాత్ర, నాగచైతన్యతో శైలజ రెడ్డి అల్లుడు, అల్లు శిరీష్ తో ఊర్వసివో రాక్షశివో వంటి సినిమాల్లో నటించింది.కానీ ఆ సినిమాలు ఏవి కూడా అను ఇమ్మానుయేల్ కు బ్రేక్ ఇవ్వలేకపోయాయి.ఇక ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ కోలీవుడ్ హీరో కార్తీ సరసన జపాన్ అనే సినిమాలో నటిస్తుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసింది.

తనకి క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఒక సంఘటనని కూడా ఆమె బయటపెట్టింది. తనని కూడా ఓ నిర్మాత కోరిక తీర్చమని అడిగాడు.కానీ నా కుటుంబ సహాయ సహకారాలతో నేను అందులో నుండి బయటపడ్డాను అని చెప్పుకొచ్చింది.అలాగే గత కొద్ది రోజులుగా ఓ యంగ్ హీరోతో అను ఇమ్మానుయేల్ ప్రేమాయణం సాగిస్తుంది అంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ విషయంపై కూడా ఆ భామ స్పందించింది.నేను ఓ యంగ్ హీరోతో లవ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.కానీ అందులో ఎలాంటి నిజం లేదు. అయితే నేను కేవలం సినిమా కోసం మాత్రమే ఆ హీరో తో కాస్త క్లోజ్ గా ఉన్నాను.ఆ హీరోతో కేవలం సినిమా పరిచయమే. అంతేకానీ ఆ హీరో తో మీరనుకున్న సంబంధం నాకు ఏమీ లేదు అని తెలియజేసింది..అయితే ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వార్తలు వచ్చేసరికి మా అమ్మ ఆ వార్తలు చూసి ఎంతో బాధపడింది. ఇక ఇలాంటి విషయాలు ముందుగా మా మమ్మీకే తెలుస్తాయి. ఎందుకంటే ఆమె న్యూస్ ఎక్కువగా ఫాలో అవుతుంది. అందుకే ఇలాంటి వార్తలు దయచేసి వైరల్ చేయకండి అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అను ఇమ్మానుయేల్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.