అధిక బరువు సమస్యతో ఈరోజుల్లో ఎక్కువ మంది బాధపడుతున్నారు.. ఎలా తగ్గాలని తీవ్రంగా ఆలోచిస్తూ ఏదేదో ప్రయత్నాలు చేస్తారు.. చివరికి కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తూ ఆ సమస్యలకు చెక్ పెడుతున్నారు.. ఇప్పుడు సులువుగా బరువు తగ్గవచ్చు అని నిపుణులు చెబుతున్నారు.. బరువును తగ్గించుకోవడం కోసం భోజన సమయంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. రాత్రి పూట భోజనంలో ఎరుపు రంగు క్యాప్సికంను కూడా తినవచ్చు. ఇవి కూడా చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. అందువల్ల శరీరానికి తక్కువ శక్తి రాత్రి పూట లభిస్తుంది. అలాగే ఆకలి కాకుండా ఉంటుంది. దీంతో బరువు తగ్గుతారు..
*. స్ట్రాబెర్రీలను తీసుకున్నా మంచిదే.. చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. 100 గ్రాముల స్ట్రాబెర్రీలను తింటే కేవలం 33 క్యాలరీలు మాత్రమే వస్తాయి. పైగా కడుపు నిండిన భావన కూడా కలుగుతుంది.. దాంతో సులువుగా బరువును తగ్గవచ్చు..
*. ఇకపోతే పుట్టగొడుగులు అధిక బరువును తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటిని రాత్రి పూట భోజనంలో తింటే మంచిది. అలాగే పలు పోషకాలు కూడా మనకు అందుతాయి.. ఆరోగ్యం బాగా ఉంటుంది..
*. కాలిఫ్లవర్ కూడా బాగానే పనిచేస్తుంది. రాత్రి పూట భోజనంలో కాలిఫ్లవర్‌ను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు.. శరీరాని ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
*. ఉత్తమమైన ఆహారాల్లో కీరదోస కూడా ఒకటి. వీటిని తినడం వల్ల కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఆకలి కూడా కాదు. దీంతో బరువు తగ్గవచ్చు… ఇంకా ఉదయం లెమన్ వాటర్, లేదా హాట్ వాటర్ ను తేనె కలుపుకొని తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు..