Eating While Standing: ప్రస్తుతం ప్రజా జీవనం మొత్తం ఉరుకుల పరుగులమయం అయింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఒక్క జాబుతో బతకలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు రెండో జాబ్ చేయాల్సి వస్తోంది. దీంతో తినేందుకు కూడా టైం ఉండడం లేదు. దీంతో బయట తినే వారి సంఖ్య ఎక్కువైపోతుంది. శరీరంపై శ్రద్ధ కూడా తగ్గుతోంది. టైంకి తినకపోవడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు తలెత్తున్నాయి. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ రోడ్డుపై ఏదో తిన్నామా అంటే తిన్నాం అన్నట్లు చేస్తున్నారు జనాలు. హోటళ్లలో లేదా కార్యాలయాల్లో ఆహారం తినే వారిని రోజూ చూస్తూనే ఉన్నాం. ఆహారం తినేటప్పుడు కొందరికి ఒక అలవాటు ఉంది. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో అలా తినాల్సి వస్తుంది. ఇంతకీ ఏంటి అలవాటని ఆలోచిస్తున్నారా ? అదే నిలబడి తినే అలవాటు. పెళ్లిళ్లలో, లేదా ఏదైనా ఫంక్షన్స్ లో నిలబడే తింటారు. ఒకసారి అయితే ఫర్వాలేదు కానీ అదే పనిగా తరచూ నిలబడి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
నిలబడి తినడం వలన కలిగే సమస్యలేంటో తెలుసుకుందాం..
* నిలబడి ఆహారం తినడం వల్ల మన ఆకలిపై సరైన అవగాహన ఉండదు. ఫలితంగా ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంది. చాలావరకు నిలబడి తినే వ్యక్తులు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. ఫలితంగా కడుపు నిండి, అసౌకర్యానికి గురవుతారు.
* మనం నిలబడి ఆహారం తింటున్న సమయంలో పేగులు కుంచించుకుపోతాయి. ఫలితంగా ఆహారం జీర్ణం కాదు. మన జీర్ణ వ్యవస్థ పై ప్రభావం చూపిస్తుంది.
* నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల కాళ్లు, తుంటిపై చెడు ప్రభావం చూపిస్తుంది. నిలబడి తినడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.
* నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల గొంతు నుంచి కడుపులోకి నేరుగా ఆహారం పడిపోతుంది. ఫలితంగా అన్నవాహికపై దుష్ప్రభావం పడుతుంది.అల్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
* నిలబడి ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోకి వెళ్లిపోతుంది. దీనివల్ల కడుపునొప్పి, ఉబ్బరానికి దారితీస్తుంది. అలాగే శరీరంలో కొవ్వు పెరుగుతుంది.