Bhagavanth Kesari: నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్ బ్యానర్స్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు, ఇక ఈ సినిమాలో యంగ్ సెన్సేషన్ బ్యూటీ శ్రీలీల కీలకపాత్రలో నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి, ఇక ఈ సినిమా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ ముహూర్తం పెట్టారు. గణేష్ యాంథమ్ ను రేపు సాయంత్రం 4.05 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.
Boys Hostel Movie: బాయ్స్ హాస్టల్ 1+1 ఆఫర్.. ఒక టికెట్ కొని ఇద్దరు సినిమా చూడచ్చు!
పోస్టర్లో నందమూరి బాలకృష్ణ శ్రీ లీల గణేష్ ఉత్సవాల్లో చిందేస్తున్నట్లు కనిపించారు. శ్రీలీల డ్యాన్స్ గురించి ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్రేజ్, గ్రేస్ అమ్మడు స్టైల్.. అదిరిపోతాయి. ఇక ఈ యంగ్ బ్యూటీతో మాస్ డ్యాన్స్ అంటే బాలయ్య రిస్క్ చేసినట్లే చెప్పాలి. అయినా కూడా ఆయన ఆ రిస్క్ ను బాలయ్య చేసేశాడు. ఇక ఈ ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 1 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక వీరిద్దరూ స్టెప్స్ వేస్తే మోత మోగాల్సిందే అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ సాంగ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే సెప్టెంబర్ 1 వరకు ఆగాల్సిందే.
The electrifying presence of #NandamuriBalakrishna and elegance of @sreeleela14 is going to be LIT in #GaneshAnthem 🔥
Song Promo Tomorrow at 4:05 PM❤️🔥
Full Lyrical on Sep 1st 💥#BhagavanthKesari
A @MusicThaman Musical 🥁@AnilRavipudi @MsKajalAggarwal @rampalarjun… pic.twitter.com/tLKFiuam1r— Shine Screens (@Shine_Screens) August 29, 2023