ప్రముఖ చైనా కంపెనీ ఒప్పో సరికొత్త ఫీచర్స్ తో కొత్త మొబైల్స్ ను లాంచ్ చేస్తుంది.. వీటికి మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే.. తాజాగా మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేయనుంది.. కొత్త A సిరీస్ ఫోన్‌లను లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఇందులో Oppo A38 సిరీస్ ఫోన్ కూడా ఉంది..ఈ స్మార్ట్‌ఫోన్ వివిధ ధృవీకరణ సైట్‌లలో గుర్తించారు. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు కానీ దీని గురించి ఆన్ లైన్ లో ఫీచర్స్ లీక్ అయ్యాయి..
Oppo A38 రెండర్‌లు, స్పెసిఫికేషన్‌లు లీక్ అయ్యాయి..ఈ హ్యాండ్‌సెట్ గత ఏడాది జనవరిలో లాంచ్ అయిన Oppo A36 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా రానుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ Qualcomm Snapdragon 680 SoCని కలిగి ఉంది. 8GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది. రాబోయే ఒప్పో A38 రెండర్‌లు, ధర, నిర్దిష్ట స్పెసిఫికేషన్‌లను లీక్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, గోల్డ్ కలర్ వేరియంట్‌లలో వస్తుందని తెలిపింది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు EUR 159 అంటే రూ.14,200 మన కరెన్సీ లో ఉండనుంది..
ఇకపోతే సెప్టెంబర్‌లో యూరప్‌లో లాంచ్ కానుందని సమాచారం. ఈ ఫోన్ త్వరలో భారత్, ఇతర ఆసియా మార్కెట్‌లకు కూడా రావచ్చు. స్పెసిఫికేషన్ల పరంగా పరిశీలిస్తే.. ఒప్పో A38 1612X720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.56-అంగుళాల LCD HD+ డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్ 50MP కెమెరాతో మరో 2MP మాక్రో సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా వెనుక యూనిట్‌తో వస్తుంది. ముందు భాగంలో 5MP సెల్ఫీ లెన్స్‌ను అందిస్తుంది. ఒప్పో A38 ఫోన్ 5,000mAH బ్యాటరీతో రానుంది… ఈ ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నాయి..