
రేపటి (బుధవారం ) నుంచి లోక కళ్యాణార్ధం, భక్తజన శ్రేయస్సు కోసం విజయవాడలోని ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో పవిత్రోత్సములు స్టార్ట్ కానున్నాయి. ఈ పవిత్రోత్సముల నేపథ్యంలో మూడు రోజుల పాటు ఆలయంలో జరిగే అన్ని ప్రత్యేక్ష పరోక్ష సేవలను ఆలయాధికారులు నిలిపేశారు. రేపటి నుంచి సెప్టెంబర్ 1వ తారీఖు వరకు ఇంద్రకీలాద్రిపై ఈ పవిత్రోత్సము కొనసాగనున్నాయి. అయితే, ఇవాళ ( మంగళవారం ) సాయంత్రం నాలుగు గంటలకు ఉదక శాంతితో ఉత్సవాలు ప్రారంభమయ్యి.. రేపు తెల్లవారు జామున 3 గంటలకు దుర్గమ్మకు సుప్రభాత సేవ, అనంతరం స్నాపనభిషేకం, నిత్యా అలంకరణ, పవిత్రాల ధారణ జరుగనుంది. అనంతరం చండీహోమం, యాగా శాల దగ్గర 11 గంటలకు గణపతి పూజ, మండపారాధన అగ్నిప్రతిష్టంభన, దేవతారాధన జరుగతాయి. దీంతో 9 గంటల నుంచి భక్తులకు దుర్గమ్మ దర్శనానికి పర్మిషన్ ఇస్తారు.
Read Also: Drugs Seized: కేరళ ఎయిర్ పోర్టులో రూ. 44 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
ఇక, రేపు సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మూలా మంత్ర వాహనములు, వేద పారాయణములు, హారతి, మంత్ర పుష్పము జరుగనుంది. అయితే, ఈ నెల 31వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు మండపారాధన, సర్వప్రాయశ్చిత విధి తాతావ్ దేవతారాధన.. ఇక, సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు మూలా మంత్ర వాహనములు, వేద పారాయణములు, హారతి , మంత్ర పుష్పము యధావిధిగా కొనసాగనుంది. చివరి రోజు (సెప్టెంబర్ 1వ తేదీ) 10:30కు పుర్ణాహుతి కలశోద్వాసన, మార్జన, మహదాశీర్వచనము కార్యక్రమలతో ఈ పవిత్రోత్సవములు ముగియనున్నాయి. పవిత్రోత్సవాల సందర్భంగా రేపటి నుంచి సెప్టెంబరు ఒకటో తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. అమ్మవారి నిత్య కైంకర్యాలను దేవస్ధాన అర్చకులు నిర్వహించనున్నారు.
Read Also: The Lancet Report: ఇండియాలో స్త్రీతో పోలిస్తే పురుషుల ఆత్మహత్యలే అధికం.. కారణాలు ఇవే..