Leading News Portal in Telugu

Andhra Pradesh: ఏపీకి భారీ వర్ష సూచన.. ఇక, వానలే వానలు..


Andhra Pradesh: తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరించడమే మానేశాయి.. అప్పుడప్పుడు.. ఓ మోస్తరు జల్లులు తప్ప.. పెద్ద వర్షం చూసి ఎన్ని రోజులు అయ్యిందోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు.. ఇక, వర్షాలు ముఖంచాటేయడంతో.. మెట్ట పంటలకు నష్టం తప్పేలా లేదని గొల్లుమంటున్నారు రైతులు.. నైరుతి రుతు పవనాలు హ్యాండ్‌ ఇవ్వడంతో ఈ సీజన్‌లో వర్షాలు కానరాకుండా పోయాయి.. అయితే, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు గుడ్‌న్యూస్‌ చెప్పింది వాతావరణశాఖ.. వచ్చే నెలలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది.. నాలుగైదు రోజుల్లో తిరిగి వర్షాలు ప్రారంభమవుతాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు..

ఆగస్టు ఆరంభం నుంచే రుతుపవన ద్రోణి హిమాలయాల వైపు ప్రయాణం చేసింది.. సాధారణంగా వారం పది రోజుల తర్వాత తిరిగి ఇది దక్షిణాది వైపు రావడం సహజంగా జరిగే ప్రక్రియ.. ఇక, ఈ ద్రోణి హిమాలయాల నుంచి కదిలి మధ్యప్రదేశ్‌పై కొన్నాళ్లు స్థిరంగా కొనసాగుతోంది.. ఇది క్రమంగా ఏపీకి విస్తరించనుంది.. దాని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవడానికి దోహదపడుతుందని అంచనా వేస్తున్నారు.. అయితే, ఈసారి భిన్నంగా మూడు వారాలకు పైగా హిమాలయాల వద్దే రుతుపవన ద్రోణి విస్తరించింది ఉంది.. ఆ ఫలితంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.. ఇక, రుతు పవన ద్రోణి దక్షిణాది వైపు కదలకపోవడంతో నైరుతి రుతుపవనాలు బలహీనమైపోయి.. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పాడమే ప్రమాదం పొంచిఉంది. కానీ, ఈ ద్రోణి సెప్టెంబర్‌ 1వ తేదీ వరకు హిమాలయాల వద్దే కొనసాగి, ఆ తర్వాత దక్షిణాదికి మారుతుందని భారత వాతావరణ శాఖ తాజాగా అంచనా వేస్తుంది.. ఈ ప్రక్రియ మొదలైన నాలుగైదు రోజులకు రాష్ట్రంలో వర్షాలు స్టార్ట్‌ అవుతాయని.. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి వానలు సమృద్ధిగా కురిసేందుకు ఆస్కారం ఉంటుందంటున్నారు.. అంటే వచ్చే నెలలో ఏపీలో సాధారణం లేదా అంతకు మించి ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తోంది వాతావరణశాఖ.