రాష్ట్రవ్యాప్తంగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్ హెచ్ ఎం) లో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎం లతపాటు అర్బన్, ఈసీ. ఆర్బిఎస్ కే ,104 తోపాటు వివిధ రకాల ఏఎన్ఎం లను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో 2వ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. 2014 లో మీ ఎన్నికల హామీల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చారని, వైద్యరంగంలో గ్రామీణ స్థాయిలో ANM వ్యవస్థ బలమైనదన్నారు ఎంపీ కోమటిరెడ్డి .
అంతేకాకుండా.. ‘రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4500 మంది 2 వ ANM లను NHM స్కీం ద్వారా గత 16-20 సంవత్సరాల నుండి ఔట్ సోర్సింగ్ ద్వారా వారిని మొదటి ANM లతో సమానంగా పని చేయించుకోవడం జరుగుతుంది. కానీ వారిని ఇప్పటివరకు రెగ్యులర్ చేయకుండా వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. కోవిడ్ సమయంలో కూడా వారి కుటుంబాలకు సైతం దూరంగా ఉండి ప్రాణాలు పోతున్న కూడా 24×7 వారి సేవలు అందించడం జరిగింది. తేదీ 26-07-2023 రోజున MPHA(F)భర్తీ కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా కాంట్రాక్టు బేసిక్ లో పనిచేస్తున్న చాలామంది 2వ ANM లు అర్హులు కాకుండా పోతున్నారు.. ఇటీవల వైద్యశాఖలో వారి డిపార్ట్మెంట్ తప్ప మిగతా అన్ని డిపార్ట్మెంట్ లో రెగ్యులర్ చేసిన విధంగా వారిని కూడా రెగ్యులర్ చేసి పే స్కెల్ ప్రకారం వారికి జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను..
గత నెల రోజులుగా వారు చేస్తున్న ధర్నా కి నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను..వారి డిమాండ్ నెరవేర్చకుండా ధర్నా చేస్తున్నారని నెపంతో వారికి షోకాజ్ నోటిసులు ఇచ్చి వేధిస్తున్నారు.. వెంటనే మీరు ఇచ్చిన షోకాజ్ నోటీసులను రద్దు చేసి వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను.. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని తర్వాత జరిగే పరిణామాలకు మీరే బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నాను..’ అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.