Leading News Portal in Telugu

IND vs PAK: గంటలోపే ‘సోల్డ్‌ అవుట్‌’ బోర్డు.. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్ క్రేజ్ మాములుగా లేదు!



Tickets Ind Vs Pak

World Cup 2023 Mastercard Users India Match Tickets Finish: భారత్‌ వేదికగా జరనున్న వన్డే ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల కోసం ఆసక్తిగా ఎదురుచూసిన చాలా మంది అభిమానులకు నిరాశే ఎదురైంది. టికెట్ల కోసం మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రయత్నించిన అభిమానుల్లో ఎక్కువ మందికి ‘సోల్డ్‌ అవుట్‌’ బోర్డు కనిపించింది. ‘మీరు క్యూలో ఉన్నారు.. దయచేసి వేచి ఉండండి’ అని రాత్రి వరకు చూపించింది. చివరకు సోల్డ్‌ అవుట్‌ అనే బోర్డు పడింది.

‘మాస్టర్‌ కార్డ్‌’ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా సాయంత్రం 6 గంటల నుంచి ‘బుక్‌ మై షో’లో భారత్‌ ఆడే లీగ్‌ మ్యాచ్‌లకు సంబంధించి టికెట్లు అందుబాటులో ఉంచారు. గంటల వ్యవధిలోనే ఆ మ్యాచ్‌ల టికెట్లు ఖతం అయ్యాయి. అన్ని లీగ్‌ మ్యాచ్‌లకు కూడా ‘సోల్డ్‌ అవుట్‌’ అనే చూపిస్తోంది. బీసీసీఐ ఇచ్చిన సమాచారం ప్రకారం… ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు భారత లీగ్‌ మ్యాచ్‌లకు అభిమానుల కోసం దశల వారీగా టికెట్లు అమ్ముతారు.

Also Read: Gold Today Price: పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!

చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్‌ మధ్య అక్టోబర్‌ 14న జరిగే మ్యాచ్‌ టికెట్ల కోసం అభిమానులు ఎగబడ్డారు. మంగళవారం తొలి విడతగా ఆన్‌లైన్‌లో ఉంచిన టికెట్లన్నీ ఒక గంటలోనే అమ్ముడుపోయాయి. బుక్‌ మై షోలో సాయంత్రం 6 గంటలకు టికెట్ల అమ్మకాలు ప్రారంభించగా.. 7 గంటలకే సోల్డ్‌ ఔట్‌ బోర్డు కనిపించింది. దాంతో టికెట్స్ దొరకని వారు నిరాశకు గురయ్యారు. ఇక సెప్టెంబర్‌ 3న మరోసారి భారత్‌-పాక్‌ మ్యాచ్‌ టికెట్ల సేల్ ఉంటుందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఒకరికి రెండు టికెట్లే ఇస్తున్నారు.