TS Double Bedroom: మహానగరంలో సొంత ఇళ్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కల. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలకు మరో మూడు రోజుల్లో గృహ ప్రవేశం లభిస్తుంది. ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసిన అధికారులు ర్యాండమైజేషన్ పద్ధతిలో అర్హులను ఎంపిక చేశారు. నియోజకవర్గానికి 500 మందికి చొప్పున గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లో 12 వేల మంది లబ్ధిదారులకు ఒకేరోజు డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయనున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు రానున్నాయన్న సమాచారంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపికైన లబ్ధిదారులకు సెప్టెంబర్ 2న డబుల్ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్ల పంపిణీకి ఆన్‌లైన్ డ్రా ద్వారా ఎంపికైన 12 వేల మంది లబ్ధిదారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని లబ్ధిదారులను అభినందించారు.
Read also: Rajini: జైలర్ కి షాక్… కలెక్షన్స్ ఫుల్ ఉండగానే ఒరిజినల్ ప్రింట్ లీక్…
మంత్రితో మాట్లాడిన బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, సైదాబాద్, యూసుఫ్‌గూడ, బేగంబజార్, బోరబండ, చాంద్రాయణగుట్ట తదితర ప్రాంతాలకు చెందిన పలువురు లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ పేదల సొంతింటి కల నెరవేరాలన్నారు. పేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన మేరకు దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తాగునీరు వంటి సకల సౌకర్యాలతో డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మించామన్నారు. పేదల కోసం నిర్మించే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను దశలవారీగా దరఖాస్తు చేసుకున్న వారికి అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎన్ ఐసీ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన ర్యాండమైజేషన్ సాఫ్ట్ వేర్ తో ఆన్ లైన్ డ్రా నిర్వహించినట్లు మంత్రి తలసాని వివరించారు. మొదటి దశలో ఒక్కో నియోజకవర్గంలో 500 మంది చొప్పున 12 వేల మందిని ఎంపిక చేశారు. సెప్టెంబరు 2న జీహెచ్‌ఎంసీ పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్‌రూం ఇళ్లను కాలనీల్లో లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఎవరికి ఎక్కడెక్కడ ఇళ్లు మంజూరు చేస్తారు అనే పూర్తి వివరాలను అధికారులు తెలియజేస్తారని మంత్రి లబ్ధిదారులకు వివరించారు.
Metro Train: మెట్రోలో అమ్మాయిలు అలా చేశారేంటి?.. షాకై చూసిన ప్రయాణీకులు