Rahul Gandhi Attacks Modi over China’s Map Dispute: చైనా-భారత్ సరిహద్దు వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై ఫైర్ అయ్యారు. భారతదేశంలో ఇంచు కూడా చైనా కబ్జా చేయలేదంటూ మోడీ అన్నీ అబద్దాలే చెప్పారంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయం లడ్డాఖ్ లో ఉన్న ప్రజలకు కూడా తెలుసునన్నారు. మన భూమిలో మన ప్రజలను కూడా ఆ ప్రాంతంలోకి చైనా అనుమతించడం లేదని, ఆఖరికి వారి పశువులను గడ్డి మేయడానికి కూడా అక్కడికి రానివ్వడం లేదని పేర్కొన్నారు. తాను కొన్ని రోజుల క్రితం లద్దాఖ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గమనించానని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని మోడీని కోరానని, అయిన ఆయన అబద్దాలలో ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ తప్పుబట్టారు.
ఇక చైనా 2023 చైనా ఎడిషన్ పేరుతో విడుదల చేసిన మ్యాప్ భారత్ లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారతలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్‌ను రిలీజ్ చేసింది. కాగా ఇందులో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ వంటి వివాదాస్పద భూభాగాలను తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది డ్రాగన్ కంట్రీ. ఇక అరుణాచల్ ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌గా చూపించడంతోపాటు తైవాన్, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశ ప్రాంతాలుగా కలిపేసుకుంది. ఈ విషయంపై మోడీ ఇంకా స్పందించలేదు. దీనిపై విపక్షాలు అధికార పార్టీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము మోడీకి ఉందా అని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో రాహుల్ చెప్పింది నిజమేనని, భారత భూభాగం ఆక్రమణకు గురయ్యిందని ఆయన ముందే చెప్పారని అన్నారు. ఇప్పుడు ఆ విషయం స్పష్టమయ్యిందని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్ సమావేశాలకు హాజరైన మోడీ చైనా ప్రతినిధులను ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా మాట్లాడిన కొన్ని రోజుల తరువాతే చైనా ఇలాంటి మ్యాప్ విడుదల చేసింది. ఇక దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్ మా సరిహద్దుల గురించి మేం స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాం. ఇలాంటి ఆరోపణలతో ప్రజల స్థలాన్ని మీరు లాక్కోలేరు అంటూ పేర్కొన్నారు. ఇక వచ్చే నెలలో భారత్ లో జరగున్న జీ-20 సదస్సుకు చైనా కూడా హాజరుకానుంది.
#WATCH | Delhi | While leaving for Karnataka, Congress MP Rahul Gandhi speaks on China government’s ‘2023 Edition of the standard map of China’; says, “I have been saying for years that what the PM said, that not one inch of land was lost in Ladakh, is a lie. The entire Ladakh… pic.twitter.com/NvBg0uhNY1
— ANI (@ANI) August 30, 2023