Leading News Portal in Telugu

Salaar Trailer: ఆగస్ట్ నెల అయిపొయింది… ఇచ్చిన మాట తప్పుతావా షేర్ ఖాన్?


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్ సెప్టెంబర్ 28న రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. సోషల్ మీడియా బజ్ ప్రకారం.. సెప్టెంబర్ 3 లేదా 7న సలార్ ట్రైలర్ బయటికొచ్చే ఛాన్స్ ఉంది కానీ మేకర్స్ నుంచి ఈ విషయంలో అఫీషియల్ అప్డేట్ మాత్రం లేదు. నిజానికి జులై 6న సలార్ టీజర్ బయటకి వచ్చి హవోక్ క్రియేట్ చేసిన 48 గంటల తర్వాత… సలార్ మేకర్స్ అఫీషియల్ గా ఒక నోట్ రిలీజ్ చేసారు. ఆగష్టు మంత్ ఎండింగ్‌ వరకూ వెయిట్ చేయండి ఇండియా సినిమాలో ఇప్పటివరకూ చూడని ట్రైలర్ రాబోతుంది అంటూ హోంబలే ఫిల్మ్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో సలార్ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆగస్టు నెల మరో 24 గంటల్లో అయిపోతుంది కానీ ఇప్పటి వరకు హోంబలే ఫిల్మ్స్ నుంచి అసలు సౌండ్ లేదు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌ సోషల్ మీడియాలో హోంబలే ఫిలింస్‌ పై మండి పడుతున్నారు.

హోంబలే ఫిల్మ్స్ మాట తప్పారని… సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఏ క్షణమైనా సలార్ ట్రైలర్ రిలీజ్ అవ్వడం గ్యారెంటీ అంటున్నారు. సలార్ రిలీజ్‌కు మరో నెల రోజుల సమయం కూడా లేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లిగ్ ఫ్యాన్స్ కానీ ట్రైలర్ కౌండ్‌డౌన్ మాత్రం ఇంకా స్టార్ట్ అవలేదు. అయితే ఇక్కడ ఇంకో లింక్ కూడా ఉంది. ఆగష్టు 31న జవాన్ ట్రైలర్ రిలీజ్ ఉంది. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ ‘ఓజి’ టీజర్ రాబోతోంది. ఈ రెండు రోజుల్లో సలార్ ట్రైలర్ రిలీజ్ చేస్తే… క్లాష్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి… ఈ రెండు డేట్స్ తప్పించి సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో సలార్ ట్రైలర్ రావడం పక్కా అంటున్నారు. దీనిపై ఏ క్షణమైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావొచ్చని టాక్. ఏ డేట్ కి వచ్చినా ఎప్పుడు వచ్చినా సలార్ ట్రైలర్ ఓ సెన్సేషన్‌గా నిలవడం మాత్రం గ్యారెంటీ.