Leading News Portal in Telugu

Tiger Nageswara Rao: టైగర్ నాగేశ్వరరావు ప్రొడ్యూసర్ కి హైకోర్టు నోటీసులు


Highcourt Notices to Tiger Nageswara Rao Producer: మాస్‌ మహరాజ రవితేజ హీరోగా నటిస్తున్న టైగర్‌ నాగేశ్వరరావు అనే సినిమా స్టువర్ట్ పురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన కొన్ని నిజమైన సంఘటలు ఆధారంగా తెరకెక్కుతోంది. టైగర్ నాగేశ్వరరావు గా రవితేజ నటిస్తున్న ఈ మూవీ విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుందన్న స్సంగతి తెలిసిందే. గతంలో రిలీజైన టీజర్ లో స్టువర్ట్ పురంలో నివసించే గిరిజను(ఎరుకల)లను దొంగలుగా చూపించారని, అలాగే స్టువర్ట్ పురాన్ని నేర గ్రామంగా చిత్రీకరించారని, స్టువర్టు పురాన్ని అభ్యంతరకరమైన పదాజాలంతో అవమానకంరంగా చూపించారని టైగర్‌ నాగేశ్వర రావు సినిమాను నిలిపివేయాలని డిమాండ్ వినిపించింది. అలాగే ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫి కమిషనర్ కి, ఏపి డిజిపికి టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని లేఖలు కూడా రాశారు. అంతేకాదు ఈ సినిమా నిలిపివేయాలని కోర్టులో కేసులు కూడా వేశారు.

Athidhi Teaser: ఒంటరిగా ఉన్న మగాడ్ని రెచ్చగొట్టిన దెయ్యం.. తరువాత ఏమైంది?

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఫిలిం ప్రొడక్షణ్ సంస్థ నిర్మాణంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వంశీ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు సినిమా అక్టోబర్ 20, 2023న రిలీజ్‌ చేసే విధంగా షూటింగ్ జరుగుతోంది. ఇక ఈ క్రమంలో టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాత అభిషేక్ నామాకి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. టైగర్ నాగేశ్వరావు సినిమా నిలుపుదల చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై న్యాయవాది పృథ్వి వాదనలు వినిపించారు. గతంలో ఎప్పుడో జరిగిన విషయాలను మళ్లీ సినిమా తీయడం ద్వారా ఒక వర్గాన్ని కించపరటంతో పాటు రెచ్చ గొట్టడమే అని పృథ్వి వాదనలు వినిపించారు. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ సహా ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసిన హైకోర్టు తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.