Leading News Portal in Telugu

BJP MP Laxman: రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే వారు.. వందల కోట్లు సంపాదించారు..?


తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు బీజేపీలో జాయిన్ అయ్యారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు, ఆయన సతిమణి దీపా వికాస్ రావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్. లక్ష్మణ్ మాట్లాడుతూ.. విద్యాసాగర్ రావు కుటుంబం నుంచి వారి పిల్లలు పార్టీలోకి రావడం సంతోషకరం అని అన్నారు.

డాక్టర్ వృత్తిలో ఉన్న కుటుంబం వృత్తిని వదులుకొని సేవ భావంతో బీజేపీలోకి రావడం సంతోషకరంగా ఉందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ళ పాలనలో అభివృద్ధిని చూసి దేశం గర్వ పడుతోంది అని ఆయన పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో సీఎం కేసీఆర్ పాలనలో నేతలు కోట్ల రూపాయలను వెనకేసుకున్నారు.. కోట్ల ఆదాయాన్ని వదులుకొని ప్రధాని మోడీని ఆదర్శంగా తీసుకొని సేవ చేయడానికి వస్తున్నారు అని ఆయన చెప్పారు.

నిజాయితీగా సేవలు అందించాలనే ప్రధాని నరేంద్ర మోడీ సంకాల్పాన్ని తీసుకొని బీజేపీలోకి అనేక మంది వస్తున్నారు అని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలి.. రబ్బరు చెప్పులు వేసుకుని తిరిగే వారు వందల కోట్లు సంపాదించారు అని అధికార పార్టీ నేతలే ఆరోపణలు చేస్తున్నారు అని ఆయన వెల్లడించారు. ఆ కిటుకు ఏందో యువతకు చెప్పాలి అని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.