Leading News Portal in Telugu

Axis Bank: కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్.. తక్కువ అమౌంట్ తో పొదుపు ఖాతా..


ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.. తాజాగా కొత్త పొదుపు పథకాన్ని ప్రారంభించింది.. ఈ పథకంలో చేరాలేనుకొనే కస్టమర్లు రూ.150 రూపాయలు చెల్లిస్తే చాలు.. అంతేకాదు ఖాతా పొందిన తర్వాత అందులో మినిమమ్‌ బ్యాలెన్స్‌ కూడా ఉంచాల్సిన అవసరం లేదని యాక్సిస్‌ బ్యాంకు తెలిపింది. అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేకుండా ఇతర ఛార్జీల నుంచి మినహాయింపును పొందవచ్చు.. ఈ పొదుపు ఖాతా గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం..

ఈ పొదుపు ఖాతా పేరు ‘ఇన్ఫినిటీ సేవింగ్స్ ఖాతా’గా నామకరణం చేసింది. దాని కోసం కస్టమర్‌లకు నెలకు రూ.150 లేదా సంవత్సరానికి ఒకేసారి రూ.1,650 చెల్లించిన సరిపోతుందని బ్యాంకు వెల్లడించింది… ఈ అకౌంట్‌ తీసుకున్న వినియోగదారులు ఎస్‌ఎంఎస్‌ ఛార్జీలు గానీ, ఇతర ఛార్జీలు ఏమి ఉండవని తెలిపింది. ప్రస్తుతం ఏ బ్యాంకు అకౌంట్‌ తీసుకున్నా అందులో నెలవారీగా కనీస బ్యాలెన్స్‌ మెయింటెన్‌ చేయాల్సిన పరిస్థితి ఉంది.. ఎక్కువ మంది బ్యాంక్ కస్టమర్లు డిజిటల్‌ అకౌంట్లను వినియోగించుకుంటున్నారు. అలాంటి వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని ఈ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు బ్యాంక్ అధికారులు వెల్లడించారు..

అదే విధంగా కస్టమర్‌కు అవసరమైనన్ని సార్లు ఏటీఎంలలో ఉపయోగించగల ఉచిత డెబిట్ కార్డ్‌లను కూడా బ్యాంక్ అందిస్తుంది. చెక్‌ బుక్‌ వినియోగం, పరిమితుల కంటే ఎక్కువ లావాదేవీలు, ఉపసంహరణలపై ఎలాంటి ఛార్జీలు ఉండవని బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. యాక్సిస్‌ బ్యాంకు అందించే పొదుపు ఖాతాను సులభంగా తీసుకునే అవకాశం పొందవచ్చు. ఈ రోజుల్లో అకౌంట్‌ తీసుకున్నట్లయితే ప్రాంతాల వారీగా ఖాతాల్లో డబ్బు నిల్వ ఉంచాల్సిన అవసరం ఉంటుంది.. మినిమమ్ బ్యాలెన్స్ ఉండాల్సిన అవసరం లేకుండానే పొదుపును తీసుకోవచ్చు…