Sidda Sudheer Kumar: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు సిద్దా సుధీర్.. నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటైన విషయం తెలిసిందే. వీరిలో ఈ రోజు ధర్మకర్తల మండలి సభ్యులుగా వైసీపీ నేత, మాజీ మంత్రి సిద్దా రాఘవరావు తనయుడు సిద్దా సుధీర్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు.. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ కార్యక్రమంలో సిద్దా రాఘవరావు కుటుంబ సభ్యులు, పలువురు టీటీడీ అధికారులు పాల్గొన్నారు.. ఇక, ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ధర్మపరిరక్షణ కోసం పనిచేస్తాననన్నారు.. టీటీడీ బోర్డ్ మెంబర్‌గా తనను నియమించిన సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన ఆయన.. టెంపుల్ యొక్క పవిత్రతను కాపాడుతూ.. సలహాలు, సూచనలు తీసుకుంటూ.. శ్రీవారి, ప్రజా సేవలో పాల్గొంటానని తెలిపారు.
కాగా, వైసీపీ నేత సిద్దా సుధీర్ కుమార్ మాజీ మంత్రి సిద్దా రాఘవరావు తనయుడు.. రాజకీయాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్న ఆయన.. తన మంత్రి రాఘవరావు మంత్రిగా ఉన్న సమయంలో కూడా నియోజకవర్గ భాద్యతలు చూసుకునే వారు.. ఇటీవల టీటీడీ చైర్మన్ రేసులో మాజీ మంత్రి రాఘవరావు పేరు వినిపించినా.. చివరకు టీటీడీ చైర్మన్ గా భూమ కరుణాకర్‌రెడ్డిని నియమించారు సీఎం జగన్.. ఇక, సుధీర్ కు ట్రస్ట్ బోర్డ్ సభ్యునిగా అవకాశం ఇచ్చారు.. అయితే, తండ్రికి కాకుండా సుధీర్ కు అవకాశం ఇవ్వడంతో.. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి సిద్దా రాఘవరావు మరోసారి బరిలోకి దిగుతారా? అనే చర్చ సాగుతోంది. మరోవైపు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు ప్రమాణస్వీకారం చేసి.. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుని బయటకు వచ్చిన సిద్దా సుధీర్‌ను వైసీపీ నేతలు, ఆయన అభిమానాలు శుభాకాంక్షలు తెలిపారు.