
Chandrababu: ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం.. అవసరమైతే మరోక సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తామని ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ కార్యాలయంలో రాఖీ పూర్ణిమ వేడుకలు జరిగాయి.. చంద్రబాబుకు రాఖీలు కట్టారు వంగలపూడి అనిత, పీతల సుజాత.. బ్రహ్మ కుమారీలు.. టీడీపీ మహిళా నేతలు.. ఇక, ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. అక్కలకు, చెళ్లల్లెకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు మహిళలను ప్రపంచంలోనే శక్తివంతమైన మహిళగా తీర్చిదిద్దుతాం అన్నారు. బంధాలు భారతీయ సంస్కృతికున్న ప్రత్యేకత.. విదేశాల్లో కూడా భారతీయ సంస్కృతిని మెచ్చుకుంటున్నారు.. మహిళల అభివృద్ధి కోసం దూరదృష్టితో ఆలోచన చేసి టీడీపీ ఎన్నో కార్టక్రమాలు.. సంస్థలు స్థాపించిందన్నారు.
Read Also: Fuel Prices: ఎన్నికల సమయం.. భారీగా తగ్గనున్న పెట్రో ధరలు..!?
మహిళలకు ఎన్టీఆర్ ఆస్తి హక్కు కల్పించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు చంద్రబాబు.. పద్మావతి మహిళ కళాశాలను నెలకొల్పింది టీడీపీనే.. బాలికా సంవృద్ధి సంరక్షణా పథకం నేనే ప్రారంభించాను అన్నారు. చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేస్తామని ప్రకటించిన ఆయన.. ఒక విధానంతో ఆడబిడ్డల జీవితాలు మారే విధంగా విధాన నిర్ణయాలు చేశాం. మహిళలతో పొదుపు ఉద్యమం చేయించాం.. ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ టీడీపీనే అన్నారు. ఆడబిడ్డ నిధితో మహిళలను ఆదుకుంటాం. ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం.. అవసరమైతే మరోక సిలిండర్ కూడా ఉచితంగా ఇస్తాం అని హామీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.