బాలీవుడ్ భామ ఊర్వశీ రౌతెలా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ భామ హీరోయిన్ గా నటించింది కొన్ని సినిమాలు అయినా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించింది. అయితే ఈ భామ ఈ మధ్యన సినిమాల కంటే ఇతర విషయాలతోనే నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆ ఆ మధ్యన టీమిండియా క్రికెటర్ రిషబ్ పంత్ తో జరిగిన వివాదంలో ఊర్వశిని నెటిజన్స్ తెగ ట్రోల్ చేశారు..ఆ తర్వాత కూడా తన హాట్ ఫొటోషూట్స్, కాంట్రవర్సీ కామెంట్స్‌తో నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా మరోసారి ఊర్వశి పై ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్స్.తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమిషానికి కోటి రూపాయలు తీసుకుంటున్నారా.. అన్న ప్రశ్నకు ఆమె అవుననే సమాధానమివ్వడం తో నెటిజన్స్ తెగ ట్రోల్ చేస్తున్నారు.. ‘నిమిషానికి కోటి రూపాయలు తీసుకుంటూ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి మీరేనా.. ఇదంతా ఎలా సాధ్యమైంది, ఇంత భారీ రెమ్యునరేషన్ రావడంపై మీరేమంటారు.. అని యాంకర్ ఆమెను ప్రశ్నించారు.’ ఇది చాలా బాగుంది కష్ట పడి పైకి వచ్చిన ప్రతి నటుడు మరియు నటి ఇలాంటి రోజును చూడాలనుకుంటారు’ అని సమాధానమిచ్చింది ఊర్వశి. అంతే రౌతెలా మాటలు విన్న నెటిజన్లు ఆమెను మళ్లీ ట్రోల్ చేయడం స్టార్ట్ చేసారు..
బాలీవుడ్ టాప్ హీరోయిన్లు అయిన దీపికా పదుకొనే,అలియా భట్ వంటి వారికీ కూడా నిమిషానికి కోటి రెమ్యునరేషన్ రావడం లేదని, చేతిలో ఒక్క సినిమా కూడా లేకుండా నిమిషానికి కోటి రెమ్యునరేషన్ ఎలా తీసుకుంటారని ఊర్వశిని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.ఈ విధంగా అబద్ధాలు చెప్పడం వల్ల మీరు గొప్ప నటి కాలేరు. ఎంతో కష్టపడితేనే మీకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వస్తుంది.ఇలాంటి మాటలతో మీరు సాధించేది ఏమి ఉండదు అని నెటిజన్స్ ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.కాగా ఊర్వశి రౌతెల ఇప్పటి వరకు కేవలం 12 నుంచి 13 సినిమాల్లో మాత్రమే కనిపించింది. అందులో కూడా హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువ. ఈ భామ ఎక్కువగా ఐటెం సాంగ్స్‌లో కనిపించింది.. ఇటీవల ఊర్వశి కేవలం స్పెషల్ సాంగ్స్‌లో మాత్రమే నటిస్తోంది. ఇటీవల ఈ భామ తెలుగులో ‘వాల్తేర్ వీరయ్య’, ‘ఏజెంట్’, ‘బ్రో’ వంటి సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.అలాగే మరో రెండు తెలుగు సినిమాల్లో ఈ భామ స్పెషల్ సాంగ్స్ లో నటించనుంది.ఈ క్రమంలో నిమిషానికి కోటి వసూలు చేస్తానని ఆమె చెప్పడం అందరినీ షాక్ అయ్యేలా చేసింది.