Ritu Sahu Incident: విశాఖలో బెంగాల్ విద్యార్థిని రితీ సాహ కేసు, కీలక మలుపు తిరిగింది. ఘటన జరిగిన నెలన్నర తర్వాత హత్య కేసుగా మార్చారు పోలీసులు. ఈ కేసులో బెంగాల్ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో విశాఖ పోలీసు యంత్రాంగం కదిలింది. ఆంధ్రా పోలీసులపై నమ్మకం లేదంటూ.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిసిన విద్యార్థిని తండ్రి.. ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఇక, మమతా ఆదేశాల మేరకు కోల్‌కతాలోని నేతాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో విశాఖలో విద్యార్ధిని హత్యకు గురైనట్లు గతంలో సెక్షన్ 302 కింద కేసు నమోదైంది. విచారణలో భాగంగా విశాఖ వచ్చారు వెస్ట్ బెంగాల్ పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు.
విశాఖ చేరుకుని హత్య కోణంలో విచారణ చేస్తున్నారు బెంగాల్ పోలీసులు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాశ్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై దర్యాప్తు మొదలైంది. ఈ రోజు సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు. రిపోర్టు ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది. ఇన్ని రోజులు రితి సాహ ది ఆత్మహత్యగా భావించిన విశాఖ పోలీసులు.. ముందు అనుమానస్పద మృతిగా సెక్షన్ 174 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు.. ఇక, పోలీసుల విచారణలో కళాశాల, హాస్టల్ యాజమాన్య నిర్లక్ష్యంగా ఉన్నట్టు గుర్తించారు. హాస్టల్ యాజమాన్యం, బైజుస్ ఆకాస్ సంస్థ, వైద్య సహాయం చేసిన ఆసుపత్రి డాక్టర్ల నిర్లక్ష్యం, వారి పాత్రపై దర్యాప్తు మొదలుపెట్టారు.. ఇక, నేడు సెక్షన్ 174 నుంచి ఐపీసీ 304 పార్ట్ 2గా మార్చారు. మరోవైపు.. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు విశాఖ పోలీసులు.. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి దర్యాప్తు కొనసాగనుంది.