
Brahmanandam Visits Tirumala With His Family : స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ఆయన వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామి వారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఇక తిరుమల వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఇక దర్శనం ముగిసిన అనంతరం ఆయన వెళ్లే బ్యాటరీ వాహనం వద్ద సెల్ఫీ దిగేందుకు భక్తులు పోటీ పడటంతో ‘ఒరేయ్ మీ మీదకు వెళ్తుంది రా నాయనా’ అంటూ జాగ్రత్తలు కూడా చెప్పారు బ్రహ్మానందం.
Raghava Lawrence: నా ట్రస్ట్ కి ఎవరూ విరాళాలు ఇవ్వొద్దు.. రాఘవ లారెన్స్ షాకింగ్ వీడియో
కొద్దిరోజుల క్రితం హైదరాబాదులో బ్రహ్మానందం చిన్న కుమారుడు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా అనేకమంది రాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కేవలం రాజకీయ ప్రముఖులు మాత్రమే కాదు బ్రహ్మానందం స్టార్ కమెడియన్ కావడంతో తెలుగు సహా పలు ఇతర భాషలకు చెందిన సినీ నటులందరూ హాజరై నూతన వధూవరులకు తమ ఆశీస్సులు అందించారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి అగ్ర హీరోలు సైతం బ్రహ్మానందం కుమారుడి వివాహానికి హాజరై తమ ఆశీస్సులు అందించడం గమనార్హం. బ్రహ్మానందంకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు గౌతమ్ సినిమాల్లో నటించారు. రెండో కుమారుడు సిద్ధార్థ్ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, అక్కడే ఉద్యోగం చేస్తుండగా సిద్ధార్థ్ పెళ్లి చేసుకున్న అమ్మాయి ఐశ్వర్య వృత్తి పరంగా డాక్టర్.