CPI Narayana: కాంగ్రెస్, సీపీఐ కలిస్తే.. తెలంగాణలో కేసీఆర్ కు డిపాజిట్ కూడా రాదని సీపీఐ జాతీయ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై కీలక వాఖ్యలు చేశారు. మునుగోడు ఎన్నికలలో బీజేపీకి వ్యతిరేకంగా, బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడు రాజకీయ పరిస్థితులు మారాయని అన్నారు. ప్రతిపక్ష మీటింగ్ కు కేసీఆర్ రాలేదని అన్నారు. మూడో ఫ్రంట్ ఎంఐఎంతో కలిసి కేసీఆర్ ఏర్పాటు చేస్తారట! అంటూ వ్యంగాస్త్రం వేశారు. కేసీఆర్ నుంచి మేం ఇంకొంచెం ముందు బయట పడాలని నారాయణ అన్నారు. కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని తెలిపారు. లోపల బయట నాయకులు కొట్టుకుంటారని అన్నారు. కాంగ్రెస్, సీపీఐ కలిస్తే.. తెలంగాణలో కేసీఆర్ కు డిపాజిట్ కూడా రాదని అన్నారు.
Read also: World Cup 2023: బీసీసీఐ.. డ్రామాలాడొద్దు! మ్యాచ్ హైలైట్స్ చూడాలా ఏంది?
బీజేపీ ఊగిసలాట నుంచి చంద్రబాబు బయటకి రావాలని హితువు పలికారు. ఏపీలో ఒక్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే బెటర్ అని అన్నారు. జైల్లో ఉన్నోల్లు, కేసుల్లో ఉన్న అధికారులు ఏపి ప్రభుత్వంలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండ పైన లిక్కర్ నిషేధమని గుర్తు చేశారు. లిక్కర్ అమ్మే వాన్ని కొండపైకి పంపారని కీలక వ్యాఖ్యలు చేశారు. మాసం అమ్మే వాళ్ళకు టీటీడీ మెంబర్లుగా ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి బ్రతికి ఉంటే, చచ్చి పోయే వారని మండిపడ్డారు. బాబు బీజేపీ ఊగిసలాట నుంచి బయటకు రావాలని అన్నారు. పార్టీల మధ్య రాష్ట్రాల్లో విభేదాలు, అయినా జాతీయ స్థాయిలో ఇండియా కూటమిలో ఉంటామన్నారు. ఓట్లు కాదు, రాజకీయ అవగాహన ముఖ్యమని తెలిపారు. ఓట్ల లెక్క కాదు, పార్టీల మధ్య అవగాహన అవసరమన్నారు. కలిసి పని చేస్తే ఓట్లు ట్రాన్సఫర్ అవుతాయని తెలిపారు. తెలంగాణ లో కాంగ్రెస్ కామ్రేడ్ల కూటమి నిశ్చితార్దం స్టేజ్ లో ఉందని నారాయణ తెలిపారు.
మరోవైపు ఈ నెల 27న సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. పొత్తులపై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదని ఈ సమావేశంలో నిర్ణయించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునేలా ఉభయ కమ్యూనిస్టు పార్టీలను ఒప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే వామపక్షాలు ప్రతిపాదించే సీట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఉత్కంఠంగా మారింది.
Karnataka: “గృహలక్ష్మీ”కి కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం.. మహిళలకు నెలకు రూ. 2000